https://oktelugu.com/

Ramoji A1 : జగన్ ఏ1 అని రాసిన రామోజీ ఇప్పుడు ఏ1

ఖాతాదారుల డబ్బును వివిధ రంగాలకు మళ్లించడం.. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధమంటూ కేసు నమోదు చేసింది. ఏకంగా వందలాది కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేయించిన జగన్ తన పగను సాధించుకున్నారు. మీడియో మొఘల్ ను దోషిగా నిలబెట్టారు. ఏ1 ముద్దాయి స్థానంలో కూర్చోబెట్టారు. 

Written By: Dharma, Updated On : June 1, 2023 5:24 pm
Follow us on

Ramoji A1 : మీడియో మోఘల్ రామోజీరావు…పచ్చళ్ల వ్యాపారంతో ప్రారంభమైన ప్రస్థానం రాజగురువు వరకూ సాగింది. వ్యాపారంలో అనూహ్య ఫలితాలు సాధించిన తరువాత ముద్రణ రంగంలోకి వచ్చి ఈనాడు స్థాపించారు.  తెలుగు రాజకీయాలను తన కనుసైగలతో శాసించారు. తన రాతలతో ఎన్టీ రామారావులాంటి నేతనే ఓ ఆట ఆడుకున్నారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంట్రీ తరువాత ఝలక్ తగిలినా.. రామోజీ వెనక్కి తగ్గలేదు. తన విషపు రాతలు మానలేదు. ఆయన కుమారుడు జగన్ ను విడిచిపెట్టలేదు. ఏ1 ముద్దాయి అని రాసి జగన్ ను అవినీతి నాయకుడిగా చూపించడంలో సఫలీకృతులయ్యారు. ఇప్పుడు అదే జగన్ రామోజీని ఏ1 ముద్దాయిగా చూపి ఆస్తులను అటాచ్ చేయించారు. తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నారు.

రామోజీ, జగన్ లమధ్య  రాజకీయ పోరు నడుస్తోంది. చంద్రబాబు  ఈనాడు సంస్థను అడ్డుపెట్టుకొని.. తనను పొలిటికల్‌గా టార్గెట్‌ చేస్తున్నారన్న ఫీలింగ్‌లో ఉన్న జగన్.. చాన్స్‌ దొరికిన ప్రతీసారి రామోజీని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. వైసీపీకి  వ్యతిరేకంగా కావాలని రాతలు రాస్తూ.. జనాల్లో పార్టీని పలుచన చేసే ప్రయత్నాలు చేస్తున్నారని.. అసెంబ్లీ సాక్షిగా జగన్‌ ఈనాడు పత్రిక మీద ఫైర్ అయిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఏకంగా రామోజీపైనే ఫైట్ కు దిగారు. తన తండ్రి హయాం నాటి మార్గదర్శి కేసును తెరపైకి తెచ్చి రామోజీరావును వెంటాడుతున్నాడు.

నిజానికి గత కొన్నేళ్లుగా చంద్రబాబు చుట్టూ రాజకీయంగా ఉచ్చు బిగించేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు రామోజీ చిక్కుకున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడే ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావును టార్గెట్ చేశారు. ఆయన ఆర్థిక కుంభస్థలంపై దెబ్బకొట్టాలని ప్రయత్నించారు. అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ వరుసబెట్టి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. కానీ, అత్యంత బలవంతుడైన రామోజీరావును ఏమీ చేయలేకపోయారు. కానీ జగన్ జగమొండి. అందుకే నేరుగా ఫైట్ కే సిద్ధపడిపోయారు.

సీబీఐ కేసుల సమయంలో తనపై కొట్టిన దెబ్బకు రెట్టింపు ఇవ్వాలని డిసైడయ్యారు. అందుకు మార్గదర్శి కేసే ఉత్తమమని భావించారు. అసలు ఖాతాదారుల ఫిర్యాదే లేని కేసులో రామోజీని బిగించారు. ఏపీలో మార్గదర్శికి 37 బ్రాంచ్‌లు ఉన్నాయి. 1989 చిట్స్‌ గ్రూప్‌లు ఉన్నాయి. తెలంగాణలో మరో 2,316 చిట్స్‌ గ్రూప్‌లు నడుస్తున్నాయి. అయితే, ఆ డబ్బును మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టడం ద్వారా.. ఖాతాదారులకు వెంటనే డబ్బుఇచ్చే పరిస్థితిలో మార్గదర్శి లేదనేది సీఐడీ ఆరోపణ. ఇలా ఖాతాదారుల డబ్బును వివిధ రంగాలకు మళ్లించడం.. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధమంటూ కేసు నమోదు చేసింది. ఏకంగా వందలాది కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేయించిన జగన్ తన పగను సాధించుకున్నారు. మీడియో మొఘల్ ను దోషిగా నిలబెట్టారు. ఏ1 ముద్దాయి స్థానంలో కూర్చోబెట్టారు.