Homeఆంధ్రప్రదేశ్‌Rajahmundry Tiger Sighting: రాజమండ్రి పరిసరాల్లో పెద్దపులి.. రంగంలోకి పవన్ కళ్యాణ్!

Rajahmundry Tiger Sighting: రాజమండ్రి పరిసరాల్లో పెద్దపులి.. రంగంలోకి పవన్ కళ్యాణ్!

Rajahmundry Tiger Sighting: ఆంధ్రప్రదేశ్ కు( Andhra Pradesh) వన్యప్రాణుల భయం వీడడం లేదు. ఒకవైపు ఏనుగులు.. ఇంకో వైపు పులులు.. ఇలా అటవీ జంతువులు జనాలను భయపెడుతూనే ఉన్నాయి. గత నెలలో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది పెద్దపులి. ఎలాగోలా దానిని పట్టుకున్నారు. అయితే మరోసారి పెద్దపులి యూటర్న్ ఇచ్చింది. ఇప్పుడు జనావాసాల మధ్య సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. రేడియో కాలర్ ద్వారా లభించిన సమాచారం ఆధారంగా ఆ పులి మళ్లీ గ్రామాల వైపు కదులుతున్నట్లు గుర్తించగలిగారు. దీంతో స్థానిక ప్రజల్లో మరోసారి ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అయితే కనుమరుగవుతున్న అడవులు, దండకారణ్యాలు కారణంగానే అటవీ జంతువులు మైదాన ప్రాంతాలకు తరలివస్తున్నాయి.

Also Read: రాజ్యసభ పదవులకు పోటీ.. తెరపైకి కొత్త లెక్కలు!

* గత నెలలోనే సంచారం..
గత నెలలోనే రాజమండ్రి( Rajahmundry) పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారం ఉండేది. దీంతో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడిపారు. చివరకు ఇతర ప్రాంతాల నుంచి రెస్క్యూ టీం లను రప్పించి పెద్దపులిని బంధించారు. అయితే ఆ కలవరం తొలగక ముందే ఇప్పుడు మరో పెద్ద పులి సంచారం మొదలైంది. ప్రధానంగా ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంకవరం మండలాల పరిధిలోని అనేక గ్రామాల ప్రజలను వెంటాడుతోంది పెద్దపులి భయం. దీంతో ఆ గ్రామాల ప్రజలను ప్రస్తుతం అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా కంబల పాలెం, మర్రి వీడు, పరిమితడక, ధారపల్లి, తాడువై, కితమూరి పేట, ఉల్లి గోగుల, మాసంపల్లి, కొత్తపల్లి, అచ్చంపేట గ్రామాల్లో హెచ్చరికలు జారీ చేశారు. రాత్రి వేళల్లో రైతులు ఒంటరిగా వెళ్ళొద్దని సూచనలు జారీచేస్తున్నారు అటవీశాఖ అధికారులు.

* పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
నెల రోజుల వ్యవధిలోనే రెండోసారి పులి సంచారంతో అటవీ శాఖ అధికారులు( Forest Department officers ) అప్రమత్తం అయ్యారు. అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీంతో ఆయన తక్షణ ఆదేశాలు ఇచ్చారు. పులి జనాభాసాల్లోకి రాకముందే సురక్షితంగా బంధించి జియో లాజికల్ పార్కు తరలించాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పులి కోసం జల్లెడ పడుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version