https://oktelugu.com/

AP Rains : పండుగ పూట వర్షాలట.. ఏపీకి బిగ్ అలెర్ట్!

అంతటా పండుగ( Pongal) ఫీవర్ నడుస్తోంది. ఆపై చలి తీవ్రత ఉంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వర్ష సూచన వచ్చింది.

Written By:
  • Dharma
  • , Updated On : January 10, 2025 / 07:25 PM IST

    Rains Alert in AP

    Follow us on

    AP Rains :  ఏపీని( Andhra Pradesh) వర్షాలు వీడేలా లేవు. తాజాగా బంగాళాఖాతం ( Bay of Bengal ) నుంచి మరో అలెర్ట్ వచ్చింది. ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ చెబుతోంది. దీని ప్రభావంతో రెండు రోజులపాటు వర్షాలు కొరవనున్నాయి. ఈ నెల 9న ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం.. 10వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతం వైపు ప్రవేశించింది. ఇది సముద్ర మట్టానికి 3.2 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి సాధారణ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. 12వ తేదీ వరకు సాధారణ వాతావరణం కొనసాగుతుందని స్పష్టం చేసింది. దక్షిణ కోస్తాలో మాత్రం 10, 12 తేదీల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాల్లో సైతం అదే పరిస్థితి ఉంటుంది. అయితే వర్షాలపై ఎలాంటి హెచ్చరికలు అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేయలేదు.

    * మరో నాలుగు రోజులపాటు
    ఆగ్నేయ బంగాళాఖాతంలో( Bay of Bengal ) కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మరో నాలుగు రోజులు ఉంటుందని.. ఏపీలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. అదే సమయంలో తెలంగాణలో మాత్రం పొడిన ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణకు ఎటువంటి వరుస సూచన లేదు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా చలిగాలులు పెరిగాయి. 15వ తేదీకి పొగ మంచు భారీగా విస్తరించనున్నట్లు తెలుస్తోంది. చలి తీవ్రతతో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.

    * రైతుల్లో ఆందోళన
    మరోవైపు ఏపీకి వర్ష సూచన ఉందని తెలియడంతో రైతులు( farmers ) ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరుసగా వర్షాలతో పంటలకు అపార నష్టం కలిగింది. ముఖ్యంగా వరి కోతల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి. కల్లాల్లో ఉన్న ధాన్యం తడిచిపోవడంతో రంగు మారాయి. వాటి కొనుగోలు విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వం( AP government ) ధాన్యం తడిచినప్పటికీ.. 25 శాతం వరకు తేమ ఉన్నప్పటికీ సాధారణ ధరనే చెల్లించి కొనుగోలు చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. ధాన్యం నిల్వ కేంద్రాలను అధికారులు తనిఖీ చేయాలని సూచించింది.

    * పెరిగిన చలి
    మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా( all over state) చలి తీవ్రత పెరుగుతోంది. విపరీతమైన పొగ మంచు కురుస్తోంది. దీంతో ఉష్ణోగ్రతలు సైతం తగ్గుముఖం పడుతున్నాయి. ఉదయం 10 గంటల వరకు మంచు తీవ్రత అధికంగా ఉంది. అసలే పండుగ సీజన్ కావడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పుడిప్పుడే శ్రమజీవులు సొంత గ్రామాలకు వస్తున్నారు. అయితే మరికొద్ది రోజులపాటు చలి ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది.