Sabarimala : ఏపీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది కేంద్రం. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావడానికి ఏపీ కారణం అయ్యింది. ఏకంగా ఏపీ నుంచి 21 మంది ఎంపీలు ఎన్డీఏ తరఫున గెలిచారు. అందులో టిడిపికి చెందిన 16 మంది, బిజెపికి చెందిన ముగ్గురు, జనసేన కు చెందిన ఇద్దరు ఉన్నారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఏపీ కారణం కావడంతో.. కేంద్ర ప్రాజెక్టుల విషయంలో అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ. ఇప్పటికే అమరావతి రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టుకు చేయూత నందించింది. రైల్వే తో పాటు జాతీయ రహదారులకు సంబంధించి కీలక ప్రాజెక్టులను కేటాయించింది. తాజాగా ఏపీ నుంచి శబరిమలై కి వెళ్లే భక్తుల కోసం రెండు రైలు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు శబరిమలై వెళ్లే భక్తుల సౌకర్యార్థం వీటిని కేటాయించింది. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ స్పందించింది. అంతకుముందే కేంద్రం సైతం ఏపీ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు చెప్పవద్దని రైల్వే శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
* శ్రీకాకుళం రోడ్ నుంచి
ఏపీ నుంచి శబరిమలై వెళ్లే భక్తులు ఎక్కువ. సాధారణంగా నవంబరు, డిసెంబర్, జనవరిలో అయ్యప్ప భక్తులు ఎక్కువగా శబరిమలై వెళుతుంటారు. ఈ తరుణంలో శ్రీకాకుళం రోడ్డు నుంచి కొల్లం వరకు ఒక రైలును, విశాఖపట్నం నుంచి కొల్లం వరకు మరో రైలును నడపడానికి ముందుకు వచ్చింది భారతీయ రైల్వే శాఖ. 08553 నంబరు కలిగిన ప్రత్యేక రైలు శ్రీకాకుళం రోడ్డు నుంచి బయలుదేరి శబరిమలై చేరనుంది. డిసెంబర్ 1 నుంచి జనవరి 27 వరకు ఇది కొనసాగనుంది. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు బయలుదేరి తరువాత రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ఆ రైలు కొల్లం చేరుకుంటుంది. అలాగే కొల్లం నుంచి శ్రీకాకుళం వరకు 0884 రైలు ప్రతి సోమవారం సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరుతుంది. ఆ మరుసటి రోజు అర్ధరాత్రి 2:30 గంటలకు శ్రీకాకుళం రోడ్డు చేరుకుంటుంది. ఈ రైలు పొందూరు, చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పడి మీదుగా కొల్లం చేరుకుంటుంది.
* విశాఖ నుంచి
మరోవైపు విశాఖ నుంచి కొల్లం వరకు మరో రైలు అందుబాటులోకి వచ్చింది. డిసెంబర్ 4వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు ఇది తిరగనుంది.ప్రతి బుధవారం ఉదయం 8.20 గంటలకు విశాఖలో బయలుదేరి తరువాత రోజు మధ్యాహ్నం 12.55 గంటలకు కొల్లం చేరుకుంటుంది. దువ్వాడ,సామర్లకోట, రాజమండ్రి,ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్ పేట, సేలం, ఈరోడ్, తిరుపూర్, పలక త్రిశూర్, ఆలువ, ఎర్నాకులం, చెంగనూరు, తిరువళ్ల, చెంగసూరు, కాయం కులం మీదుగా కొల్లం చేరనుంది. విశాఖకు వచ్చే రైలు సైతం ఇదే మార్గంలో నడవనుంది.ప్రతి గురువారం రాత్రి 7:35 గంటలకు బయలుదేరుతుంది. తరువాత రోజు రాత్రి 11:20 గంటలకు విశాఖ చేరుకుంటుంది.