Chandrababu : సాధారణంగా రాజకీయ నాయకులు ప్రజల్లోకి వెళ్లేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో తాము వేసే దుస్తులకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ముందుంటారు. ఆయన దుస్తులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే నాయకుల్లో చంద్రబాబు మాత్రం భిన్నంగా కనిపిస్తుంటారు. ఆయన ప్రతిరోజు ఒకే రంగుతో కూడిన దుస్తులు వేసుకుంటారు. దశాబ్దాలుగా దానినే కొనసాగిస్తుంటారు. ముదురు రంగులో ఉన్న బంగారు రంగు దుస్తులు, లేదంటే గోధుమ రంగు దుస్తులు ధరిస్తారు. కానీ అవి కాస్త పసుపు రంగులో ఉంటాయి. చొక్కా లేత రంగు అయితే.. ఫ్యాంట్ మాత్రం ముదురు రంగులో ఉంటుంది. నల్లటి షూ ధరిస్తారు. కళ్ళజోడు ను వాడుతుంటారు. అదికూడా రీడింగ్ గ్లాసెస్ మాత్రమే. అయితే చంద్రబాబు ఒకే రంగు ఉన్న దుస్తులు ధరించడం వెనుక ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దుస్తులు ధరిస్తే లాభాలేంటి? ఒకే రంగు దుస్తులు వేసుకునే వ్యక్తుల మనస్తత్వం ఎలా ఉంటుంది? అన్నది విశ్లేషకులు ఇలా అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మనస్తత్వ శాస్త్రం ఈ విషయంలో చాలా రకాల విశిష్టతలను చెబుతోంది.
* అందరికంటే భిన్నం
చంద్రబాబు డ్రెస్సింగ్ స్టైల్ అందరికంటే భిన్నంగా ఉంటుంది. అందుకే ఆయనకు ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. ఇలా ఒకే కలర్ దుస్తులు ధరించడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. ప్రతిరోజు ఒకే రంగు దుస్తులు ధరించడం వల్ల ఆ వ్యక్తికి మంచి సౌకర్యంగా అనిపిస్తుంది. అతని పాత్రతో పాటు మనస్తత్వం గురించి ఎదుటివారు అంచనా వేయలేరు. అవి మానసిక ఒత్తిడిని తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు.
* అందుకే ఆ రంగు దుస్తులు
సాధారణంగా మనకు ఇష్టమైన రంగు, దుస్తులను విడిచి పెట్టడానికి ఇష్టపడడం. నచ్చితే అవే దుస్తులను రోజుల తరబడి వాడుతాం. అయితే మనుషుల సైకాలజీ అది. ప్రతి వ్యక్తి తన భావోద్వేగాలను ప్రతిబింబించే రంగులని ఎంచుకుంటారు. ఈ విషయంలో చంద్రబాబు మాత్రం పసుపు రంగును ఎంచుకున్నారు. అది తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉంటుందన్నది ఒక విశ్లేషణ మాత్రమే. కానీ పసుపు రంగు ధరించడంతో అంతా మంచే జరుగుతుందన్నది ఒక నమ్మకం కూడా. పసుపు అనేది హిందువులకు శుభసూచికం. ఏ పని ప్రారంభించాలన్నా పసుపును కచ్చితంగా వాడతారు.
* ఇట్టే గుర్తుపడతారు
చంద్రబాబు నడకతో పాటు డ్రెస్ సెన్స్ చూసి ఆయనను ఇట్టే గుర్తుపడతారు. ఇండియన్ మోస్ట్ సీనియర్ లీడర్ గా ఉన్న చంద్రబాబు తెలియని వారు ఉండరు. ఉత్తరాది రాష్ట్రాల ప్రజల సైతం ఈజీగా గుర్తించడానికి కారణం ఆయన దుస్తులే.ఎంతటి సభలో అయినా.. కార్యక్రమంలో అయినా చంద్రబాబు ఒకే రంగు దుస్తులతో కనిపించడం నిత్య కృత్యం. అయితే చాలా ఇంటర్వ్యూలు చంద్రబాబుకు ఇదే ప్రశ్న ఎదురైంది. తెలుగుదేశం పార్టీ రంగు కావడం వల్లే మీరు అలా దుస్తులు వేస్తున్నారా అన్న ప్రశ్న ఉత్పన్నమయింది. కానీ తన మనస్తత్వానికి దగ్గరగా ఉందని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ముఖ్యంగా చాలా రకాల మనస్తత్వ నమ్మకాలను బలంగా నమ్ముతారు చంద్రబాబు. అదే ఆయనలో ఉన్న ఆత్మస్థైర్యం.