Radha Krishna Questions Chandrababu: చంద్రబాబు విధానాలను సాక్షి వ్యతిరేకించింది అంటే ఒప్పుకోవచ్చు.. ఎందుకంటే అది జగన్ కరపత్రిక కాబట్టి.. జగన్ కు చంద్రబాబు వ్యతిరేకం కాబట్టి.. చంద్రబాబుకు వ్యతిరేకంగా సాక్షి రాతలు రాస్తుంది. కానీ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాయడమే ఇక్కడ ఆశ్చర్యకరం. వాస్తవానికి కొంతకాలంగా ఎందుకనో తెలియదు రాధాకృష్ణ చంద్రబాబు మీద వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తున్నాడు. తన పత్రికలో కూటమి ఎమ్మెల్యేలపై అడ్డగోలుగా రాస్తున్నాడు.. రాధాకృష్ణ ఈ స్థాయిలో నెగిటివ్ టోన్ గతంలో చంద్రబాబు మీద ఎన్నడూ ప్రదర్శించలేదు. ఒకరకంగా ఈనాడు కంటే ఎక్కువ బట్టలు చింపుకున్నాడు.
Also Read: ఏపీలో ఇంత అన్యాయం ఏంటి? ఆ ఎమ్మెల్యేను అడిగేవాళ్లే లేరా?
చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేసి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అంటూ కీర్తించాడు. కానీ ఇప్పుడేమో చంద్రబాబుకు వ్యతిరేకంగా రాస్తున్నాడు. తాజాగా తన పత్రికలో కొత్త పలుకు శీర్షికన రాసిన సంపాదకీయంలో రాధాకృష్ణ ఒంటి కాలు మీద లేచాడు.. ” చంద్రబాబుకు పీ -4 పిచ్చి పట్టుకుందని.. ఎవరో చంద్రబాబుకు తలమాసిన సలహాలు ఇస్తున్నారని.. వారు కనిపిస్తే సన్మానం చేయాల్సి ఉంటుందని” రాధాకృష్ణ తన కొత్త పలుకులో రాసుకొచ్చారు. వాస్తవానికి సాక్షి చేయాల్సిన పనిని ఆంధ్ర జ్యోతి చేసింది. వాస్తవానికి ఇటీవల కాలంలో సాక్షి పోషించాల్సిన పాత్రను ఆంధ్రజ్యోతి పోషిస్తున్నది..
Also Read:చంద్రబాబు ఉన్నతి వెనుక రాజశేఖర్ రెడ్డి.. నిజం ఎంత?
కేవలం పీ -4 పథకంతోనే రాధాకృష్ణ ఆగిపోలేదు.. కూటమి ఎమ్మెల్యేల అవినీతి వ్యవహారాలను రాధాకృష్ణ తుర్పారపట్టాడు. గతంలో అధికారంలో ఉన్న ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేల కంటే ప్రస్తుత కూటమి ఎమ్మెల్యేల వ్యవహారాలు పెరిగిపోయాయని.. ప్రతి వ్యవహారంలో అక్రమాలు ఎక్కువయ్యాయని.. స్థలం కొనుగోలు నుంచి మొదలు పెడితే బిల్డింగ్ నిర్మాణం వరకు ప్రతిదాంట్లో ఎమ్మెల్యేలు వాటా అడుగుతున్నారని రాధాకృష్ణ చెప్పుకొచ్చాడు. ఒకరకంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని తూర్పారపట్టాడు. రాధాకృష్ణ ఇలా రాయడం ఇది కొత్త కాకపోయినప్పటికీ.. ఈసారి మాత్రం తన టోన్ పెంచి రాధాకృష్ణ రాశాడు. అంటే చంద్ర బాబు మధ్య రాధాకృష్ణ మధ్య గ్యాప్ పెరిగిందా.. గ్యాప్ పెరగడానికి కారణాలేంటి.. రాధాకృష్ణ ఇలా రాయడానికి ప్రేరేపించిన అంశాలు ఏమిటి.. అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది.