Homeఆంధ్రప్రదేశ్‌YS family disputes: వైఎస్ ఫ్యామిలీ వివాదాల్లో తలదూర్చి బుక్ అవుతున్న ఆ నేత

YS family disputes: వైఎస్ ఫ్యామిలీ వివాదాల్లో తలదూర్చి బుక్ అవుతున్న ఆ నేత

YS family disputes: ఇటీవల జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) కుటుంబ వ్యవహారాల్లో ఎక్కువగా మాట్లాడుతున్నారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. కడప జిల్లాకు చెందిన ఈయన ఇటీవల జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఆస్తి వివాదాలపై ప్రస్తావించారు. వైయస్ విజయమ్మ న్యాయస్థానానికి తన కుమారుడు జగన్ వైఖరి గురించి లేఖ రాశారు. తన కుమార్తె షర్మిల పిల్లలకు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడంటూ చెప్పుకోచ్చారు. రాజశేఖర్ రెడ్డి తన ఆస్తిని నలుగురు పిల్లలకు సమానంగా రాసి ఇవ్వాలని కోరారని.. అదే చివరి కోరిక అని కూడా చెప్పుకొచ్చారు. అయితే దీనిపై రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గట్టిగానే మాట్లాడారు. షర్మిల తో పాటు విజయమ్మ పేరు ప్రస్తావిస్తూ వ్యాఖ్యానాలు చేశారు. అయితే దీనిపై షర్మిల ఘాటుగానే స్పందించారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా.. ఆయన తన కుక్కలతో మాట్లాడిస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనవసరంగా వైఎస్ కుటుంబ ఆస్తి వివాదంలో రాచమల్లు మాట్లాడుతున్నారు అంటూ విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు.

కుటుంబ విషయాలు బయటకు..
అనవసరంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ( Siva Prasad Reddy )తన కుటుంబ విషయాలను కూడా బయట పెట్టుకున్నారు ఈ వ్యవహారం ద్వారా. దీనిపై టిడిపి కడప నేతలు రాచమల్లు పై విరుచుకుపడుతున్నారు. సొంతింటిని చక్కబెట్టుకోలేని మనిషి ఎదుటి కుటుంబాలపై మాట్లాడుతున్నారు అంటూ బీటెక్ రవి ఎద్దేవా చేశారు. ఇటీవల రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రెండో కుమార్తె వివాహం జరిగింది. ఆ వివాహానికి పెద్ద కుమార్తెను పిలవలేదు. పెద్ద కుమార్తె ఓ బీసీ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతోనే ఆమెను పిలవలేదన్న విషయాన్ని బయటపెట్టారు బీటెక్ రవి. పేరుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం కానీ.. ఆ పార్టీ బీసీల కోసం ఏం చేయలేదు అంటూ ఎద్దేవా చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని 2009లో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రాజకీయ ద్రోహం చేశారు అంటూ ఆరోపణలు చేశారు. అనవసరంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వైయస్ కుటుంబ వ్యవహారాల్లో తల దూర్చారని సొంత పార్టీ శ్రేణులు వ్యాఖ్యానించే పరిస్థితి వచ్చిందట.

కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి..
కాంగ్రెస్( Congress) పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిలర్ గా ఎంట్రీ ఇచ్చారు. తరువాత వైస్ చైర్మన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ఒకానొక దశలో జగన్మోహన్ రెడ్డితో ఆయన విభేదించినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా 2014లో ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అలా అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2019 ఎన్నికల్లో సైతం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కడప జిల్లా నుంచి యాక్టివ్గా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు వైయస్ ఫ్యామిలీ వివాదాల్లో తలదూర్చి అనవసరంగా ఆయనే బుక్ అవుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version