Pulivendula ZPTC Bypolls 2025: ఏపీ మాజీ ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలోని పులివెందులలో జడ్పిటిసి స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉపఎన్నికల్లో వైసీపీ తరఫునుంచి హేమంత్ రెడ్డి పోటీలో ఉన్నారు. ప్రస్తుతం పులివెందుల తోపాటు ఒంటిమిట్ట జెడ్పిటిసి స్థానానికి కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండు స్థానాలు అత్యంత సున్నితమైనవి కావడంతో పోలీసులు ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగడానికి భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 1400 మంది పోలీసులు ఈ రెండు స్థానాలలో మోహరించారు.
Also Read: పులివెందుల ఉప ఎన్నిక.. 442 ఓట్లు దాటితే చాలు.. చంద్రబాబు పెద్ద ప్లాన్!
ఒకవైపు ఎన్నికలు జరుగుతుండగానే వైసిపి అభ్యర్థి హేమంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కీలక వీడియో విడుదల చేశారు..” నా ఇంటి చుట్టూ బయటి ప్రాంతాల వ్యక్తులు తిరుగుతున్నారు. కర్రలతో ఓటర్లను బెదిరిస్తున్నారు. ఏజెంట్లను పోలింగ్ బూత్ లోపలికి రాకుండా అడ్డుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బయట వ్యక్తులు డిన్నర్ ఏర్పాటు చేసుకున్నారు. దీనికి ఎలా అనుమతిచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగకుండా చూస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగితే గెలిచేది నేనే. ఆ విషయం తెలిసి అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారు. వ్యవస్థలను ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు. ఇలా అయితే ప్రజాస్వామ్యం ఎలా నిలబడుతుందని” హేమంత్ రెడ్డి తన స్వీయ వీడియోలో పేర్కొన్నారు.
Also Read: పులివెందులలో ఓడితే.. ఇరు పార్టీలకు ప్రాణ సంకటమే!
హేమంత్ రెడ్డి ఆరోపణల నేపథ్యంలో టిడిపి నాయకులు స్పందించారు..” ఓటర్లను బెదిరించడం వైసిపికి అలవాటు. కర్రలతో కొట్టడం వారికి రివాజు. గత కొన్ని దశాబ్దాలుగా పులివెందులలో వారు చేసింది అదే. ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల్లో గెలవలేక వైసీపీ అభ్యర్థి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇవేవీ కూడా నిలబడవు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసీపీ అభ్యర్థి చెబుతున్నట్టుగా బయట వ్యక్తులు డిన్నర్ ఏర్పాటు చేసుకోలేదు. ఉప ఎన్నికల్లో కచ్చితంగా గెలిచేది మేమే. అందువల్లే వైసీపీ నేతలు ఏవేవో మాట్లాడుతున్నారు. వారు గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్టు. ఓడిపోతే మాత్రం అక్రమాలు చేసినట్టు.. ఈసారి పులివెందులలో సరికొత్త చరిత్ర లిఖించబోతున్నాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త చరిత్ర సృష్టించాం. ఉప ఎన్నికల ద్వారా మా బలాన్ని మరింత సృష్టినం చేసుకోబోతున్నామని” టిడిపి నేతలు చెబుతున్నారు.
పోలింగ్ ఏజెంట్లను లోపలికి రానివ్వడం లేదు.. పులివెందుల వైసిపి జెడ్పిటిసి అభ్యర్థి హేమంత్ రెడ్డి
నా ఇంటి చుట్టూ బయటి ప్రాంతాలకు చెందిన వ్యక్తులు తిరుగుతున్నారు.
ఓటర్లను కర్రలతో బెదిరిస్తున్నారు. పోలింగ్ బూత్ లోకి ఏజెంట్లను రానివ్వకుండా అడ్డుకుంటున్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద… pic.twitter.com/hqmKKfpbmv
— OkTelugu (@oktelugunews) August 12, 2025