Pulivendula Bypoll MissingVotes: అసలు పులివెందులలో( pulivendula) ఏం జరుగుతోంది? నిజమైన ఓటర్లు ఓటు వేయగలుగుతున్నారా? లేకుంటే బయట వ్యక్తులు ప్రవేశించరా? ఇప్పుడు ఇదే చర్చ. అయితే ఓ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఓటు వేసేందుకు వెళ్లారు. అయితే మీ ఓటు లేదంటూ చెప్పి తిప్పి పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో 100 మంది కొత్తవారు కనిపించారని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంలో ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. అధికార బలంతో తెలుగుదేశం పార్టీ ఇటువంటి చర్యలకు దిగుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అయితే దశాబ్దాల వైయస్సార్ కుటుంబ హవా పోతుందన్న భయంతోనే ఈ రౌడీ రాజకీయానికి తెరతీసారని టిడిపి విమర్శిస్తోంది.
Also Read: పులివెందులలో ఉప ఎన్నికలు.. వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి సంచలన వీడియో
ప్రతిష్టాత్మకంగా పోరు
పులివెందుల నియోజకవర్గంలో.. పులివెందుల అనేది చిన్న మండలం. దాదాపు పదివేల 600 ఓట్లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ జడ్పిటిసి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. చనిపోయిన జడ్పిటిసి కుమారుడిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించింది. అయితే అనుకోని అవకాశంగా భావించిన తెలుగుదేశం పార్టీ.. టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి సతీమణితో పోటీ చేయించింది. దీంతో పోరు ప్రతిష్టాత్మకంగా మారింది. దాదాపు 11 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇండిపెండెంట్ లు భారీగా పోటీ చేశారు. అయితే భారీగా ప్రలోభాల పర్వం నడిచినట్లు ప్రచారం జరుగుతోంది. ఓటుకు పదివేల రూపాయల చొప్పున పంపకాలు చేసినట్లు తెలుస్తోంది.
Also Read: పులివెందుల ఉప ఎన్నిక.. 442 ఓట్లు దాటితే చాలు.. చంద్రబాబు పెద్ద ప్లాన్!
భారీ పోలీసు బందోబస్తు
అయితే రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో పులివెందుల ఒకటి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో అధికారపక్షం పట్టు బిగించింది. అయితే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 1500 మంది పోలీసులను నియమించారు. అయితే ప్రతి గ్రామంలో గతంలో ఎన్నడూ చూడలేని వ్యక్తులు ప్రవేశించారని.. ఓట్ల కోసం బారులు దీరానని ఆయా గ్రామస్తులు చెబుతున్నారు. భారీగా దొంగ నోట్లు నమోదయ్యాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓటు వేసేందుకు వెళుతున్న వారికి వెనక్కి పంపారని.. అటువంటి వారంతా తిరుగు ముఖం పట్టి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలా కొత్త వ్యక్తుల విషయంలో పరస్పరం ప్రధాన పార్టీలు ఆరోపణలు చేసుకుంటున్నాయి. మరి అందులో నిజం ఎంత ఉందో వారికే తెలియాలి.
Breaking News
మా ఊర్లో ఓటు వేసుకునే పరిస్థితి లేదు
మా ఊరు మొట్నుతలపల్లిలో @JaiTDP బయటి వ్యక్తులు 100 మంది తిష్ట వేశారు
మా స్లిప్ తీసుకుని తరిమేశారు.. ఓటు వేయకుండా వెనుతిరుగుతున్నాం
– ఓటర్ల ఆవేదన pic.twitter.com/Dqh0XVJ7Gs
— Telugu Feed (@Telugufeedsite) August 12, 2025