MP Raghunandan Rao: ఎమ్మెల్సీ కవితపై ఎంపీ రఘునందన్ రావు షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. మంగళవారం హైదరాబాద్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తండ్రి, కుమార్తెల మధ్య మధ్యవర్తులెందుకు ఆయన ప్రశ్నించారు. జూన్ 2వ తేదీన కవిత కొత్త పార్టీ రాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. అనంతరం తెలంగాణలో కవిత పాదయాత్ర చేస్తారని ప్రకటించారు. కవిత గెలిచినప్పుడు కేసీఆర్ దేవుడయ్యారని.. మరి ఇప్పుడు దెయ్యం ఎలా అయ్యారంటూ ఎంపీ రఘునందన్ సందేహం వ్యక్తం చేశారు.