Prashna Ravan arrest కులాలు , మతాలు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం , హిందూ ధర్మాన్ని అనుసరించే వాళ్లపై విషం కక్కడం, నిద్ర లేస్తే ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై నోటికి వాచినట్టు బూతులతో రెచ్చిపోవడం వంటివి చేస్తూ వచ్చిన ప్రముఖ యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’ ని రీసెంట్ గానే ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇతన్ని అరెస్ట్ చేసినప్పటికీ కూడా కోర్టు నాలుగు కేసుల్లో బెయిల్ ఇచ్చింది. దీంతో నిన్న ఏలూరు చెక్ పోస్టు వద్ద మరోసారి ప్రశ్న రావణ్ ని మరో కేసు లో అదుపు తీసుకున్నారు. నేడు ఉదయం ఆయన్ని మరోసారి గన్నవరం పోలీసులు అరెస్ట్ చేసి , రాజద్రోహం కేసుని నమోదు చేశారు.
UPA యాక్ట్ సెక్షన్ 13, సెక్షన్ 39 క్రింద రావణ్ పై FIR నమోదైంది. ఇది సాధారమైన కేసు కాదు , కోర్టు దీన్ని సీరియస్ గా తీసుకుంటే రావని 7 నుండి 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష కూడా పడే అవకాశాలు ఉన్నాయి. టెర్రరిస్టులకు సంఘీభావం తెలుపుతూ గతంలో రావణ్ తన యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియో చేసాడు. ఈ వీడియో లో ఆయన ముంబై తాజ్ హోటల్ లో ఎంతో మంది అమాయకుల ప్రాణాలను నిర్దాక్షణంగా పొట్టపెట్టుకున్న కసబ్ లాంటోళ్లను కూడా ‘పాపం కుర్రోళ్ళు’ అంటూ సంబోధిస్తూ కూడా ఆయన మాట్లాడాడు. ఈ సెక్షన్ క్రింద కూడా రేపు ఆయనకు బెయిల్ వస్తే మాత్రం , ఆంధ్ర ప్రదేశ్ లో లా & ఆర్డర్ సరిగ్గా లేదు అనే అనుకోవాలి అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క రావణ్ తనకు నాలుగు సార్లు బెయిల్ ఇచ్చినప్పటికీ, అదే కేసు లో మరో స్టేషన్ నుండి వచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని , ఇది కచ్చితంగా కక్ష్య సాధింపు చర్య అని , తనపై వేసిన కేసులను కొట్టివేయాలంటూ హై కోర్టులో పిటీషన్ వేసాడు.
దీనిపై హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. ఈ అంశం పై ఎలాంటి తీర్పు వస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం. మరోపక్క రావణ్ నిన్న అరెస్ట్ అయ్యే ముందు మీడియా ముందుకొచ్చి , తనని అక్రమం గా అరెస్ట్ చేస్తున్నారని, నన్ను చంపాలని అనుకుంటే చంపేయండి అని, లేదంటే నేనే నిరాహారదీక్ష చేసి చనిపోతాను , ఇప్పటికే నేను అన్నం తిని , నీళ్లు తాగి 5 రోజులు అయ్యింది అంటూ పెద్ద డ్రామా చేసాడు. అయినప్పటికీ ఇతనిపై జనాల్లో ఇసుమంత కూడా సానుభూతి రావడం లేదు, ఒక్క వైసీపీ పార్టీ అభిమానుల్లో తప్ప. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే వైసీపీ అధినాయకుడు , విపక్ష నేత , మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా రావణ్ కి మద్దతు పలకడం గమనార్హం.

