Prashant Kishor- Jagan: ఏపీ విషయంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు పశ్చత్తాప పడుతున్నారు. జగన్ కు రాజకీయంగా పనిచేసినందుకు ఇప్పడు బాధపడుతున్నారు. అయితే ఈ రియలైజేషన్ జగన్ ఏదో విధ్వంసకర పాలన చేసినందుకు కాదు. జగన్ ను అధికారంలోకి తీసుకురావడానికి పీకే చేసిన పనులు, దుస్సాహసాలు అందరికీ తెలిసినవే. ప్రజలను కులాలు, మతాలు, వర్గాలుగా విడగొట్టి మరీ జగన్ దగ్గరకు చేర్చారు. జగన్ కు లబ్ధి చేకూర్చారు. జగన్ తన పాలనతో ఏపీ భవిష్యత్ ను అంధకారంలోనెట్టారు. ఆర్థిక క్రమశిక్షణ కట్టుదాటి రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగిస్తున్నారు. అయితే పీకే వీటిని చూపి జగన్ అధికారంలోకి రావడానికి ఎందుకు సహకరించానని తాజాగా కామెంట్స్ చేయలేదు. జగన్ తో పాటు బిహార్ సీఎం నితీష్ వంటి వారికి సహకరించింది బదులు.. మహాత్మాగాంధీ కాంగ్రెస్ కోసం తాను కృషిచేయ్యాల్సిందని గుర్తు చేసుకొని బాధపడుతున్నారు. అయితే వ్యూహకర్త సడన్ గా మాట మార్చడం వెనుక ఏదో స్కెచ్ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ వ్యూహకర్తగా ఉన్న పీకే జనసూరజ్ పార్టీని స్థాపించి బిహార్ లో 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఈ కామెంట్స్ చేశారు.

దేశంలో చాలా పార్టీలకు హెల్ప్ చేసి పవర్ లోకి తీసుకొచ్చిన తాను.. ముందుగా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు. ఆ పనిచేసి ఉంటే ఈపాటికే బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నిలిచేదన్నారు. అయితే పీకే తాజా కామెంట్స్ పై రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ విషయంలో పునరాలోచించడానికి అనేక కారణాలున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఒక స్ట్రాటజిస్టుగా గమినించి కాంగ్రెస్ తో తన సూరజ్ పార్టీ చెలిమికి బాటలు వేసుకునే క్రమంలో పీకే కామెంట్స్ చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ తో కీలక చర్చలు జరిపి ఆ పార్టీకి పనిచేస్తారన్నవ్యాఖ్యలు వినిపించాయి. కానీ ఆ విషయంలో పీకే వ్యూహం బెడిసికొట్టింది. అందుకే సూరజ్ పార్టీని స్థాపించి అర్జెంట్ గా బిహార్ లో జేడీయూ కు ప్రత్యామ్నాయంగా నిలపాలన్న వ్యూహంతో పాదయాత్ర చేస్తున్నారు.

అయితే ఏపీలో జగన్ కు అవనసరంగా సాయం చేశానన్న మాట కూడా వ్యూహంలో భాగమే. ఇప్పటికీ పీకే ఐ ప్యాక్ టీమ్ జగన్ పార్టీ కోసం పనిచేస్తోంది. గతంలో మాదిరిగా ప్రజలను విభజించే ప్రయత్నం చేస్తోంది. అందుకే పీకే సలహాలు, సూచనలు లేవంటే ఎలా నమ్మాలి? గతంలో తాను పనిచేసిన పార్టీలే ఇప్పుడు పీకే పాదయాత్రకు సహాయం చేస్తున్నాయన్న ప్రచారం ఉంది. అటువంటప్పుడు తాను గతంలో పనిచేసిన పార్టీల విషయంలో పశ్చాత్తాపం పడడం రాజకీయ స్ట్రాటజిస్టు స్ట్రాటజీని ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. బిహార్ లో పీకే చేపడుతున్న పాదయాత్రకు ప్రజల నుంచి పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. పైగా రాహుల్ పాదయాత్ర ప్రజల్లో దూసుకుపోతోంది. కచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ వైపు యూటర్న్ అవుతారని గమనించి పీకే మాట మార్చారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.