Prakash Raj: గత కొంతకాలం నుండి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పై ప్రకాష్ రాజ్(Prakash Raj) తీవ్రమైన విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతి లడ్డు విషయం లో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పై లేవనెత్తిన ప్రశ్నలు అప్పట్లో సంచలనంగా మారాయి. దీనికి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇవ్వడం, ఆ తర్వాత ప్రకాష్ రాజ్ డబుల్ కౌంటర్ ఇవ్వడం వంటివి మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇక ఆ తర్వాత కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నప్పటికీ, రీసెంట్ గా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం లో పవన్ కళ్యాణ్ త్రిభాషా విధానం పై తన అభిప్రాయాన్ని చెప్పడం, అదే విధంగా సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఇతర మతాల ప్రస్తావన తీసుకొని రావడం వంటివి రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం. ఈ అంశాలపై కూడా ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించాడు.
Also Read: పవన్ నీడలా వెంటాడుతున్న ప్రకాష్ రాజ్.. తాజాగా సంచలన ట్వీట్!
ఇక రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మరోసారి పవన్ కళ్యాణ్ పై చాలా తీవ్రమైన విమర్శలు చేశాడు. ఆయన మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత మరొకలాగా వ్యవహరిస్తున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద మాట్లాడిన ఆయన, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను పూర్తిగా పట్టించుకోవడం వదిలేసాడు. ఎంతసేపు సనాతన ధర్మం బోధనలు చేస్తూ సమయాన్ని మొత్తం వృధా చేస్తున్నాడు. నేను సనాతన ధర్మం కి వ్యతిరేకిని కాదు. కానీ అది చాలా సున్నితమైన అంశం, తిరుపతి లడ్డు విషయం లో కల్తీ జరిగితే, విచారించి బాధ్యులను శిక్షించండి. కల్తీ చేసినట్టు సరైన ఆధారాలు ఉంటే, అప్పుడు నిలదీసి సనాతన ధర్మం వైపు నిలబడి మాట్లాడండి. అక్కడ నిజానిజాలు ఇంకా నిర్ధారణ కాలేదు, ఈయనకి ఈయనే ఒక నిర్ధారణకు వచ్చేసి సమాజం విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలను ఇస్తున్నాడు’ అంటూ ప్రకాష్ రాజ్ మండిపడ్డాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘సనాతన ధర్మం గురించి ఇంతగా మాట్లాడుతూ వస్తున్న పవన్ కళ్యాణ్, ఎన్నికల సమయంలో ఇదే సనాతన ధర్మాన్ని ఎజెండా తీసుకొని ఓట్లు అడగాల్సింది, ఎందుకు అలా చేయలేదు?, జనాలు అంత పిచోళ్లు కాదు. అసలు అతను ఉప ముఖ్యమంత్రి పదవి ని తీసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. అసెంబ్లీ లో ప్రతిపక్షం ఉండడం చాలా ముఖ్యం. ఇతను ఎందుకు ప్రతిపక్ష హోదా ని తీసుకొని జనాల తరుపున మాట్లాడకూడదు?, ఎంతసేపు మేము బద్దలు కొట్టాం, 11 సీట్లకు పరిమితం చేశాం అని చెప్పుకుంటున్నారు. ఇంకెంత కాలం అలా చెప్పుకుంటారు, అదంతా జరిగిపోయిన గతం, ఎన్నికల సమయంలో మీరిచ్చిన హామీల సంగతేంటి?, అవి ఎప్పుడు అమలు చేస్తారు?’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
లడ్డూలో కల్తీ జరిగిందని తెలిస్తే శిక్షించాలి మతాల మధ్య చిచ్చు పెట్టడం ఎందుకు? pic.twitter.com/RqYD8zsvnV
— Graduate Adda (@GraduateAdda) April 2, 2025