https://oktelugu.com/

Praja Shanti Party: ప్రజాశాంతికి కుండ గుర్తు.. కేఏ పాల్ సంబురం చూడాల్సిందే

ఎన్నికల సంఘం కుండ గుర్తు కేటాయించిన నేపథ్యంలో పాల్ సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ఆకర్షించేందుకు చేతిలో కుండతో కనిపిస్తున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 13, 2024 / 02:22 PM IST

    Praja Shanti Party

    Follow us on

    Praja Shanti Party: మట్టి కుండ ఆరోగ్యానికి మంచిదంటారు. ఎండాకాలంలో అందులో నీళ్లు తాగితే బాగుంటుందని పెద్దలు చెబుతుంటారు. అలాంటి కుండ ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చేతిలోకి వెళ్ళింది. అదేంటి కేఏ పాల్ చేతిలోకి కుండా వెళ్లడం ఏంటి? అని అనుకుంటున్నారా.. కేఏ పాల్ చేతుల్లోకి కుండ వెళ్లింది నిజమే.. ఆయన చేతుల్లోకి కుండ వెళ్లడానికి కారణం ఎన్నికల సంఘం. ఎందుకంటే త్వరలో జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల సంఘం కుండ గుర్తును కేటాయించింది. వాస్తవానికి ప్రజాశాంతి పార్టీ అధికారిక చిహ్నం పావురం. కానీ దానిని కేటాయించకుండా ఎన్నికల సంఘం పాల్ పార్టీకి కుండ గుర్తును ప్రకటించింది.

    ఎన్నికల సంఘం కుండ గుర్తు కేటాయించిన నేపథ్యంలో పాల్ సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ఆకర్షించేందుకు చేతిలో కుండతో కనిపిస్తున్నారు. “ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు. ఈ ఎన్నికల్లో మన పార్టీకి కుండ గుర్తును కేటాయించింది.. మట్టి కుండ కుండ ఆరోగ్యానికి మంచిది. కుండ గుర్తు పొందిన ప్రజాశాంతి పార్టీ కూడా ఏపీ రాష్ట్రానికి చాలా మంచిది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ప్రజాశాంతి పార్టీతోనే అవుతుంది. అందుకే ప్రజలు ఎన్నికల సంఘం కేటాయించిన కుండ గుర్తుకు ఓటు వేసి ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. ప్రజాశాంతిని అధికారంలోకి తీసుకొస్తే లక్షల కోట్లను తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని” పాల్ ప్రకటించారు.

    పాల్ పార్టీకి కుండ గుర్తు రావడంతో సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. “మొన్నటిదాకా పావురం గుర్తును అధికారిక చిహ్నంగా ప్రకటించాడు. ఇప్పుడేమో ఎన్నికల సంఘం కుండ గుర్తును కేటాయించింది. ఇక చేతిలో కుండతో పాల్ చేసే హడావిడి మామూలుగా ఉండదు. ఇప్పటికే చేతిలో కుండతో పాల్ కనిపిస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయ్యేంతవరకు ఆయన అలానే ప్రచారం చేస్తారు కావచ్చు” అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

    కాగా, ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీలకు మాత్రమే అధికారిక గుర్తులను ఎన్నికల్లో కేటాయిస్తుంది. రిజిస్టర్డ్ పార్టీలు ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తుల మీదనే పోటీ చేయాల్సి ఉంటుంది. పాల్ పార్టీ రిజిస్టర్ పార్టీ కాబట్టి ఎన్నికల సంఘం.. ఏపీ శాసనసభ ఎన్నికల్లో కుండ గుర్తు కేటాయించింది.. మరి ఈ ఎన్నికల్లో పాల్ పార్టీని కుండ గుర్తు గెలిపిస్తుందా.. అసెంబ్లీ దాకా పంపిస్తుందా.. అనే ప్రశ్నలకు కొద్ది రోజులు ఆగితే సమాధానం తెలుస్తుంది.