Telugu States Politics: రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. అంతకంటే ముందే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తి విరుద్ధ ప్రభుత్వాలు ఉన్నాయి. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ఉంది. అయితే ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే ఈ రెండు రాష్ట్ర పాలకుల ప్రత్యర్థులు స్నేహితులే. అయితే ఏపీలో ప్రత్యర్థి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోంది కూటమి ప్రభుత్వం. తెలంగాణలో గులాబీ పార్టీని కేసులతో భయపెడుతోంది కాంగ్రెస్ సర్కార్. అయితే ఏపీలో రెడ్డి సామాజిక వర్గం పై.. తెలంగాణలో మరో బీసీ సామాజిక వర్గం పై కేసులు పెరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఎక్కడ కుల ప్రభావం లేదు. గతంలో వారు వ్యవహరించిన తీరుతోనే ఇలా కేసులను ఎదుర్కొంటున్నారు.
* ఏపీలో ఆ సామాజిక వర్గం వారే..
ఏదైనా ఒక సామాజిక వర్గం వారిపై కేసులు నమోదు చేసినా.. అరెస్టులు జరిగినా.. సామాజిక వర్గం ప్రభావం అధికంగా కనిపిస్తుంది. తమ వారిని టార్గెట్ చేసుకుంటున్నారు అన్న భావన ఉంటుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం జగన్ కోసం పనిచేశారు కొందరు సామాజిక వర్గం నేతలు. ఒక వ్యవస్థీకృతమైన నేరాలకు పాల్పడ్డారు. అందులో అంతిమ లబ్ధిదారుడు తో పాటు లబ్ధి పొందింది ఆ నలుగురు ఐదుగురు మాత్రమే. అందుకే ఈ కేసులను సామాజిక కోణంలో చూడడం లేదు. సొంత సామాజిక వర్గంలో కూడా చలనం లేదు.
* తెలంగాణలో సేమ్ సీన్..
తెలంగాణలో కూడా సేమ్ సీన్. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కాన రాలేదు. అధికారం అనేది శాశ్వతం అన్నంత రీతిలో వ్యవహరించారు. గులాబీ పార్టీలోని కుటుంబ సభ్యులు వ్యవస్థీకృత నేరాలకు పాల్పడ్డారు. అందులో కొంతమంది నేతలను మాత్రమే భాగస్వామ్యం కల్పించారు. తాము లబ్ధి పొందడమే కాదు ఆ నలుగురికి మాత్రమే లబ్ధి చూపించగలిగారు. అందుకే ఫోన్ టాపింగ్ కు పాల్పడగలిగారు. ఇప్పుడు అదే కేసుల్లో చిక్కుకుంటున్నారు ఒక సామాజిక వర్గం వారు మాత్రమే. అయినా సరే తెలంగాణ సమాజం నుంచి, ఆ సామాజిక వర్గం నుంచి ఎటువంటి ప్రతికూలతలు కానీ.. అభ్యంతరాలు కానీ వినిపించడం లేదు..