Politician Indecent Behavior: శీర్షిక చదివి మమ్మల్ని తిట్టుకుంటున్నారు కదూ. మీ స్థానంలో మేము ఉంటే అలాగే తిట్టుకునే వాళ్ళం. కనబడితే రెండు చెంపలు వాయించే వాళ్ళం కూడా. ఎందుకంటే ఆ శీర్షిక అలా ఉంది కాబట్టి. వాస్తవానికి ఈ తరహా భాషను ప్రయోగించాలంటే మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మా న్యూస్ వెబ్సైట్ ను అందరూ చూడాలనేదే తాపత్రయం. అంటే తప్ప ఒక సెక్షన్ రీడర్స్ చదవాలనేది కాదు. కాకపోతే జరిగిన దారుణం అటువంటిది. ఇటువంటి దారుణాన్ని వెలుగులోకి తీసుకొచ్చే క్రమంలో ఆ తరహా భాష వాడక తప్పడం లేదు. పెద్ద మనసుతో క్షమిస్తారని కోరుకుంటున్నాం. ఇక డైరెక్టుగా విషయంలోకి వెళ్తే..
ప్రభుత్వ పథకాలు పేదలకు అందాలని ఏలుతున్న నాయకులు చెబుతుంటారు. పెద్దపెద్ద సమావేశాలు పెట్టు మరి గొప్పగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. వాస్తవానికి ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం పేదవాడికి చేరితే అంతకుమించిన ఆనందం ఇంకొకటి ఉండదు. ఎందుకంటే పథకం అనేది పేదవాళ్లకు చేరినప్పుడు క్రమక్రమంగా పేదరికం తగ్గిపోతుంది. తద్వారా జీవించే హక్కు.. అందరికీ సమానంగా ఉంటుంది. ఒకరి మీద ఆధారపడకుండా స్వశక్తితో బతికే వారి సంఖ్య పెరుగుతుంది. అంతకు మించిన ఆనందం ఇంకెక్కడ ఉంటుంది. పైగా పథకాలను పకడ్బందీగా ప్రభుత్వాలు అమలు చేస్తే.. వాళ్ల అధికారానికి ఇబ్బంది ఉండదు. కానీ మన ప్రభుత్వాలు అలా చేయవు కదా. పథకాల విషయంలో అధికార పార్టీ నేతల నొక్కుడు ఎక్కువగా ఉంటుంది కదా. పైగా అధికార పార్టీ నేతలకు పేటెంట్ రైట్ మాదిరిగా ప్రభుత్వ పథకాలు ఉంటాయి కదా.. పైగా ఇలాంటి వ్యవహారాలలో ఏ వ్యవస్థలు జోక్యం చేసుకోలేవు. జస్ట్ చూస్తూ ఉంటాయి.
పేదలకు పథకాలు కావాలి కాబట్టి నేతల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆ అధికార పార్టీలో ఉన్న నాయకులు పేదల అవకాశాన్ని ఆసరాగా చేసుకొని రకరకాల వ్యవహారాలకు పాల్పడుతుంటారు. అయితే తెలంగాణలోని ఓ ప్రాంతంలో ఓ ప్రభుత్వ పథకానికి సంబంధించి ఓ మహిళ అధికార పార్టీ నాయకుడిని కలిసింది. మొదట్లో కచ్చితంగా చేస్తానని హామీ ఇచ్చిన అతడు.. ఆ తర్వాత ఆమెను అనేక పర్యాయాలు తన వద్దకు రప్పించుకున్నాడు. వచ్చిన ప్రతి సందర్భంలో ఆమె అందం అతడిని భూమి మీద నిలువనీయకుండా చేసేది. దీంతో అతడు ఆమె అందాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఇక అప్పటినుంచి అసలు కథ మొదలుపెట్టాడు.
తన వద్దకు రావాలని.. మల్లెపూలు పెట్టుకోవాలని.. అందంగా తయారు కావాలని.. వారానికి రెండుసార్లు వచ్చిపోతే సరిపోతుందని.. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వ పథకమే కాదు ఇంకా చాలా అందుతాయని ఆఫరించాడు. దీంతో ఆమె భయపడిపోయింది. ఇలాంటిది తప్పని చెప్పింది. అయినప్పటికీ అతడు వినిపించుకోలేదు. దీనికి తోడు మరింత దూకుడుగా వెళ్లడం మొదలుపెట్టాడు.. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ఒప్పుకుంది. అయితే అతని బాగోతాన్ని మొత్తం ఫోన్లో రికార్డ్ చేసింది. అది కాస్త సోషల్ మీడియాలోకి ఎక్కడంతో ఒక్కసారిగా సంచలనం నమోదయింది.
వాస్తవానికి ఇక్కడ పేర్లు బయట పెట్టవచ్చు. ప్రాంతాలతో సహా వెల్లడించవచ్చు. లీగల్ గా ఇబ్బంది అవుతుంది కాబట్టే ఆ వివరాలు బయట పెట్టడం లేదు. సాధారణంగా అధికార పార్టీ అనగానే కార్యకర్తలకు కొమ్ములు ఉండవు. నాయకులకు పేటెంట్ రైట్స్ ఉండవు. అధికారమనేది కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మారిపోతూ ఉంటుంది. కానీ ఇటువంటి నాయకులు అధికార పార్టీలో ఉంటే మాత్రం అధికారం ఐదేళ్లు కాదు కదా.. ఐదు నిమిషాలు కూడా ఉండదు.