Homeఆంధ్రప్రదేశ్‌AP Survey: ఏపీ ఎన్నికల్లో ఆ పార్టీ సునామీ.. తేల్చిన మరో సర్వే!

AP Survey: ఏపీ ఎన్నికల్లో ఆ పార్టీ సునామీ.. తేల్చిన మరో సర్వే!

AP Survey: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి కనిపిస్తుండగా, తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. పార్లమెంటు ఎన్నికలతోపాటు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, అటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పలు సంస్థలు సర్వే చేశాయి. ఇప్పటికే ఇండియా టుడే, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, టౌమ్స్‌ నౌ వంటి ప్రముఖ సంస్థలు కూడా ప్రీపోల్‌ సర్వే ఫలితాలు వెల్లడించాయి. తాజాగా మరో సంస్థ ప్రీపోల్‌ సర్వే చేసింది. తాజాగా ఈ సంస్థ కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే పార్టీ ఏదో తేల్చింది.

జగన్‌ సునామీ..
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. బీజేపీ–టీడీపీ–జనసేన కూటమిగా బరిలో దిగుతుండగా, అధికార వైసీపీ ఒంటరిగా పోటీకి సిద్ధమయ్యాయి. ఇక కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. వై నాట్‌ 175 నినాదంతో వైసీపీ అధినేత, సీఎం జగన్‌మోమన్‌రెడ్డి వ్యూహ రచన చేస్తున్నారు. సిద్ధం పేరుతో ఇప్పటికే రాష్ట్రం మొత్తం కవర్‌ అయ్యేలా నాలుగు భారీ సభలు నిర్వహించారు. మరోవైపు టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి పొత్తులు కొలిక్కి వచ్చాయి. అభ్యర్థుల ఎంపిక కూడా తుది దశకు చేరుకుంది. ఈ తరుణంలో ఈసారి అధికారం ఎవరిది అన్న చర్చ జరుగుతోంది.

పొలిటికల్‌ క్రిటిక్స్‌ సర్వే..
ఈ క్రమంలో తాజాగా పొలిటికల్‌ క్రిటిక్స్‌ సర్వే సంస్థ ఏపీ ఎన్నికలకు సంబంధించి సర్వే ఫలితాలను వెల్లడించింది. వచే ్చ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి అధికారం కోసం పోటీ పడుతున్నాయి. ఎక్కువశాతం ఓట్లు పొందేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో పలు సర్వే సంస్థలు ఇప్పటికే అంచనాలు విడుదల చేశాయి. అన్ని సర్వేలు జగన్‌మోహన్‌రెడ్డివైపు మొగ్గు చూపాయి. తాజాగా పొలిటికల్‌ క్రిటిక్స్‌ సంస్థ కూడా ప్రీపోల్‌ సర్వేలో జగన్‌ సునామీ తప్పదని వెల్లడించింది.

ఫలితాలు ఇలా…
2024 ఏపీ శాసన సభ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తున్నందని సర్వే సంస్థ అంచనా వేసింది. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమికి పరాభవం తప్పదని తేల్చింది. ఈ సర్వే ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ 121 +/– 5 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. వైసీపీకి 49.5 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. ఇక టీడీపీ–బీజేపీ–జనసేన కూటమికి 54+/–5 స్థానాలు గెల్చుకుంటుందని తెలిపింది. ఈ కూటమికి 43 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. ఇక కాంగ్రెస్‌ పరిస్థితి ఈ ఎన్నికల్లోనూ మెరుగ పడదని పేర్కొంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేవలం 2.5 శాతం ఓట్లు వస్తాయని, ఇతరులకు 5 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version