Homeఆంధ్రప్రదేశ్‌Sajjala Bhargav Reddy : ఇక సజ్జల భార్గవ్ టార్గెట్.. బిగుస్తున్న ఉచ్చు.. ఎక్కడ మొదలుపెట్టారంటే?

Sajjala Bhargav Reddy : ఇక సజ్జల భార్గవ్ టార్గెట్.. బిగుస్తున్న ఉచ్చు.. ఎక్కడ మొదలుపెట్టారంటే?

Sajjala Bhargav Reddy : ఏపీ వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. అరెస్టులు కూడా ప్రారంభమయ్యాయి. ప్రధానంగా సోషల్ మీడియాలో వైసీపీకి అనుకూలంగా ఉంటూ.. జగన్ పై విమర్శలు చేసే వారిని టార్గెట్ చేసుకునేవారు. టిడిపి తో పాటు జనసేన కీలక నేతలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టేవారు. ఆ కుటుంబాల్లో మహిళలను సైతం బయటకు లాగే వారు. లేనిపోని అసత్య కథనాలు అల్లేవారు. అటువంటి వారిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసుకుంది. ఈ విషయంలో వర్రా రవీందర్ రెడ్డి ముందు వరుసలో ఉండేవారు. వైసిపి కీలక నేత కుటుంబానికి సహాయకుడిగా వ్యవహరించి రవీందర్ రెడ్డి.. సోషల్ మీడియాలో కీలక భూమిక పోషించేవారు. అనుచిత వ్యాఖ్యలతో ప్రత్యర్థులపై విరుచుకుపడేవారు. జుగుప్సాకరమైన పదజాలాలతో.. సభ్య సమాజం తలదించుకునేలా పోస్టులు పెట్టేవారు. అందుకే ఏపీ పోలీసులుఆయనను అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా విభాగంలో పనిచేసే రాష్ట్ర స్థాయి నేతలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో అర్జున్ రెడ్డి అనే నేత తెరపైకి వచ్చారు. ఆయనపై సైతం నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు, భార్గవరెడ్డి పై సైతం కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఆయన చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు సమాచారం. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవ రెడ్డితో పాటు ఆ ఇద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వర్రా రవీందర్ రెడ్డి, అర్జున్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినట్లు పులివెందుల పోలీసులు తెలిపారు.

* ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు
సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనే వ్యక్తి దళితుడు. ఆయన వైసీపీ విధానాలతో పాటు జగన్ వైఖరిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై వర్రా రవీందర్ రెడ్డి తో పాటు అర్జున్ రెడ్డి తనను కులం పేరుతో దూషించారంటూ హరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న భార్గవరెడ్డి తో పాటు ఆ ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే రవీందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు అర్జున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు నాన్ బెయిలబుల్ కేసు నేపథ్యంలో భార్గవ రెడ్డిని సైతం అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

* గత ఐదేళ్లుగా ఆ బాధ్యతలు
2019లో వైసిపి గెలిచిన తర్వాత ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం బాధ్యతలను సజ్జల భార్గవరెడ్డికి అప్పగించారు. అప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీతో పాటు ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ తరుణంలో పార్టీలో సోషల్ మీడియా విభాగం అత్యంత బలమని సజ్జలకు తెలుసు. అందుకేఆ విభాగం బాధ్యతలను తన కుమారుడికి ఇప్పించుకున్నారు.అయితే గత ఐదేళ్లలో వైసిపి అధికారంలో ఉండడంతో ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం రెచ్చిపోయి వ్యవహరించింది.ముఖ్యంగా జగన్ ను వ్యతిరేకించే వారితో పాటు టిడిపి, జనసేన శ్రేణులను సైతం టార్గెట్ చేసుకుంది. చివరకు టిడిపి నేతల కుటుంబ సభ్యులను విడిచిపెట్టలేదు. తన కుటుంబం సైతం బాధితులుగా మిగిలారని పవన్ స్వయంగా మంత్రివర్గ సమావేశంలోనే చెప్పుకొచ్చారు.అయితే వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న భార్గవ రెడ్డి ప్రోద్బలంతోనే ప్రతినిధులు పోస్టులు పెట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏకంగా ఓ దళిత యువకుడు ఫిర్యాదుతో భార్గవరెడ్డిని అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version