Polavaram Project: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు రూ.1301 ఓట్లు విడుదల చేసింది. ఈ నిధులు పోలవరం ప్రాజెక్టు అకౌంట్లోకి నేరుగా జమ అవుతాయని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఏపీ విషయంలో కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తోంది. మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత వార్షిక బడ్జెట్లో అమరావతి రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించింది. గతంలో రూ.1508 కోట్లు విడుదల చేయగా.. తాజాగా మరోసారి కేంద్రం అడ్వాన్సుడ్ నిధులు కేటాయించింది. మొత్తానికి ఈ 22 నెలల్లో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రూ.2809కోట్లు అందినట్లు అయింది. మరోవైపు ఈనెల 2న పోలవరం పర్యటనకు వెళ్తున్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్. ఎప్పటికప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు పనులను సమీక్షిస్తూ వచ్చారు. పోలవరం పై కేంద్రానికి నివేదికలు ఇస్తూనే ఉన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ నిధులను కేటాయించింది. అయితే గత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల మేరకు నిధులు దాదాపుగా వచ్చేశాయి.
* అధికారుల విన్నపం మేరకు..
కేంద్ర ప్రభుత్వం గతంలో రూ.1508 కోట్లు మంజూరు చేయగా అందులో రూ.600 కోట్లు ప్రాజెక్టు పనుల కోసం కేటాయించింది. మరో రూ.300 కోట్లు పునరావసం, భూ సేకరణ కోసం ఖర్చు చేశారు. ఇటీవల కేంద్ర జలశక్తి అధికారులు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు. ఆ సమయంలో ఏపీ అధికారులు నీతుల విషయాన్ని ప్రస్తావించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కోసం సింగిల్ నోడల్ అకౌంట్ కు నిధులను విడుదల చేయడం ఇదే చివరిసారి. ఇకపై స్పర్శ విధానంలో నిధులను విడుదల చేయనున్నారు.
* ప్రత్యేక లక్ష్యంతో..
సకాలంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తిచేసి జాతికి అందించాలన్న లక్ష్యంతో ఉంది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో శరవేగంగా పనులు జరిపిస్తోంది. గత అనుభవాల దృష్ట్యా వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని చూస్తోంది. అయితే మొన్నటి బడ్జెట్ సెషన్స్ లో సైతం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ ప్రాజెక్టుకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు భారీగా నిధులు కేటాయించారు. ఇది శుభ పరిణామం కూడా..
