PM Modi:ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) ఏపీ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఏపీ విషయంలో ఉదారంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. అమరావతికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు. అందుకే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో స్వయంగా మాట్లాడాలని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సైతం సమాచారం ఇచ్చారు. దీంతో పోలవరం ప్రాజెక్టుకు ఉన్న సమస్యలు తొలగిపోయే పరిస్థితి కనిపిస్తోంది.
Also Read: రోహిత్ కెరియర్ అలా ముగియకూడదు.. ఒకవేళ నేను బీజీటీ కోచ్ అయితే: రవి శాస్త్రి!
* విభజన హామీలో భాగంగా
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటుతోంది. ఇంకా విభజన సమస్యలు కొలిక్కి రాలేదు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు ( polavaram project) జాతీయ హోదా ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణ ఖర్చును కేంద్రం భరిస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టు కోసం భారీగా నిధులు విడుదల చేసింది. అయితే సరిహద్దు రాష్ట్రాల నుంచి చాలా రకాల అభ్యంతరాలు ఉన్నాయి. అందుకే ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై మోదీ తొలిసారి సమీక్షించనున్నారు. ఈనెల 28న మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఆంధ్ర, తెలంగాణ, ఒడిస్సా, చత్తీస్గడ్ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడనున్నారు ప్రధాని మోదీ.
* ఏపీ ప్రభుత్వానికి సమాచారం..
పోలవరం ప్రాజెక్టు సమీక్షకు సంబంధించి ప్రధాని కార్యాలయం నుంచి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కు( AP CS Vijayanand ) సమాచారం వచ్చింది. 2014లో మోడీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేస్తూ అప్పట్లో కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఆ తరువాత జరిగిన చర్చల ఫలితం కారణంగా ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత ఏపీ ప్రభుత్వానికి అప్పగించాలని కేంద్రానికి నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. దీనికి కేంద్ర జల శక్తి శాఖ సానుకూలంగా స్పందించింది. అప్పటినుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను ఏపీ ప్రభుత్వమే చూస్తోంది. 2027 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. ఈ నేపథ్యంలోనే సరిహద్దు రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కేంద్రం.
* సమస్యలకు మోక్షం..
అయితే దీనిని అత్యున్నత సమీక్షగా భావిస్తున్నారు. దీంతో పోలవరం ప్రాజెక్టుకు ఉన్న సమస్యలు తొలగుతాయని ఒక అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం( Telangana government) తమ ఆందోళనలను జల శక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. మరోవైపు ఒడిస్సా తో పాటు చత్తీస్గడ్ నుంచి కూడా అభ్యంతరాలు ఉన్నాయి. అందుకే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఏకతాటిపైకి తెచ్చి.. ఈ సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం చూపాలని ప్రధాని మోడీ భావిస్తున్నారు. ఆయన ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.