Akhil Akkineni : సినిమా ఇండస్ట్రీలో చాలా ఫ్యామిలీ లు ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నప్పటికి అక్కినేని ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు వేరనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఫ్యామిలీ నుంచి హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయిన అక్కినేని నాగేశ్వరరావు దగ్గర నుంచి అఖిల్ వరకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఇండస్ట్రీకి సేవలు అందిస్తూ వస్తున్నారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక కీలకమైన వ్యక్తిగా కూడా పేరు సంపాదించుకున్నారు. అలాంటి నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన నాగార్జున కూడా స్టార్ హీరోగా ఎదిగడమే కాకుండా చాలా వైవిద్యమైన పాత్రలను కూడా పోషించాడు. ఇక తన ఎంటైర్ కెరియర్ లో తనను తాను స్టార్ హీరోగా మార్చుకున్నాడు. ఇక తన తదుపరి మూడోతరం నట వారసులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య అఖిల్ లాంటి హీరోలు విజయాలను అందుకోవడంలో కొంతవరకు తడబడుతున్నారు. కొన్ని సక్సెస్ లను అందుకుంటూ ముందుకు సాగుతున్నప్పటికీ అఖిల్ మాత్రం ఇప్పటికి సరైన సక్సెస్ ని దక్కించుకోలేకపోతున్నాడు.
ఆయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 9 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఆయనకు ఒక్క సక్సెస్ కూడా లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అందువల్లే నాగార్జున ఆయన కోసం ఒక పెద్ద డైరెక్టర్ ని రంగంలోకి దింపాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా క్లారిటీగా తెలియడం లేదు. కానీ సినిమాలు రియలేస్టిక్ గా ఉండకపోవడం వల్లనే ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.
అంటూ కొంతమంది సినీ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తెరకెక్కినప్పటికీ ఆయన యాక్టింగ్ కూడా రియలేస్టిక్ గా ఉండడం లేదంటూ వాళ్ళు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఇక మీదట వచ్చే సినిమాలతో అయినా ఆయన న్యాచురల్ గా నటించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మీదట అక్కినేని ఫ్యామిలీ ముందుకు సాగాలంటే అఖిల్ చాలా మంచి సినిమాలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. నాగచైతన్య ఎలాగో మీడియం రేంజ్ లో కొనసాగుతున్నాడు.
కానీ అఖిల్ కి మాత్రం స్టార్ హీరో అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ ఆయన దాన్ని పర్ఫెక్ట్ గా వాడుకోవడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో ఇకమీదట ఆయన చేసే సినిమాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని అక్కినేని ఫ్యామిలీ స్టార్ డమ్ ను ముందుకు తీసుకెళ్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…