Nara Lokesh: ఈ భూమ్మీద తల్లిని మించిన యోధురాలు లేరు. పిల్లలకు ప్రాణం పోవడానికి తన ప్రాణాన్ని కూడా ఆమె లెక్క చేయదు. అందుకే మాతృదేవోభవ అంటుంటారు. తాను పోసిన ప్రాణాలకు ఏదైనా ముప్పు ఏర్పడితే ఆ కన్నతల్లి పడే ఆవేదన మామూలుగా ఉండదు.
అటువంటి తల్లుల బాధను తీర్చడానికి.. వారికి కన్నీటి శోకం ఉండకూడదని ఏపీ మంత్రి నారా లోకేష్ ముందుకు వచ్చారు. దీని కోసం ఏకంగా “ప్రాజెక్టు పునర్విక” ను ప్రకటించారు.
అమ్మ కడుపులో నుంచి పుట్టే పిల్లలు అందరూ ఒకే విధంగా ఉండరు. కొందరులో జన్యు మార్పులు ఉంటాయి. ఇది అనేక రకాల వ్యాధులకు దారి తీస్తాయి. జన్యువుల్లో మార్పుల వల్ల వచ్చే వ్యాధులు అత్యంత తీవ్రంగా ఉంటాయి. ఇవి మందులకు అంత ఈజీగా లొంగవు. పైగా చూస్తుండగానే ప్రాణాలు పోతాయి. ఉదాహరణకు పునర్విక కేసును తీసుకుంటే.. ఈమెకు వచ్చిన వ్యాధి జన్యుపరమైనది. ఇది వెన్నెముకను, మెదడును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. నరాల బలహీనత.. కండరాల క్షీణతకు దారితీస్తుంది. దీనివల్ల మనిషి అడుగు తీసి అడుగు వేయలేడు. కనీసం తనకు ఏం జరుగుతుందో చెప్పలేడు. చివరికి చూస్తుండగానే ప్రాణాలు పోతాయి.
పునర్విక ప్రాణాలు కాపాడేందుకు 16 కోట్లకు ఖర్చయింది. ఈమెకు అందించిన ఇంజక్షన్ అమెరికా నుంచి తెప్పించారు. ఈ ఇంజక్షన్ కు దాదాపు నారా లోకేష్ 6 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. ఒక రకంగా ఆ పాపకు ఆయన పునర్జన్మ అందించే బాధ్యతను తీసుకున్నారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్వికకు డబ్బులు కొంత మేర మాత్రమే సమకూరాయి. నారా లోకేష్ చొరవ తీసుకొని ఏకంగా 6 కోట్ల వరకు ఇచ్చారు. వాస్తవానికి ఇంజక్షన్ అమెరికా నుంచి తెప్పించడానికి నారా లోకేష్ తీవ్రంగా ప్రయాసపడ్డారు. చివరికి ఆ ఇంజక్షన్ అందిస్తున్న తీరును చూసి భావోద్వేగానికి గురయ్యారు. తనకు ఊపిరి సలపని పని ఒత్తిడి ఉన్నప్పటికీ.. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న రెయిన్బో చిన్నారుల ఆసుపత్రికి వెళ్లారు. ఇక్కడ పునర్వికకు అందిస్తున్న వైద్యాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. పునర్విక తల్లిదండ్రులు నారా లోకేష్ ను కలుసుకొని కృతజ్ఞతలు తెలియజేశారు.
పునర్వికకు పునర్జన్మ అందించిన తర్వాత నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టు పునర్వికను ప్రకటించారు. ఆ పాపకు 16 కోట్ల ఇంజక్షన్ ఇస్తుండగా చూడడం భావోద్వేగాన్ని కలిగించిందని లోకేష్ పేర్కొన్నారు. అరుదైన సమస్యలతో బాధపడే చిన్నపిల్లలు చాలామంది ఉన్నారని.. అటువంటి పిల్లల కోసం చికిత్సను అత్యంత సులభతరం చేయడానికి.. ఖర్చులను తగ్గించడానికి.. కేంద్రంతో మాట్లాడతానని.. ఫార్మా కంపెనీలతో.. వైద్యులతో కలిసి తన పని చేస్తానని నారా లోకేష్ ప్రకటించారు.
వాస్తవానికి ఒక నాయకుడు అనేవాడు ప్రజలతో కలిసిపోవాలి. ప్రజలతో మమేకం కావాలి. ప్రజలు కష్టాల్లో ఉంటే తాను భుజం కాయాలి. అవసరమైతే వారికోసం ఎక్కడి దాకైనా వెళ్లాలి. అలాంటివారు కచ్చితంగా ప్రజా నాయకుడు అవుతారు. అనతి కాలంలోనే నారా లోకేష్ లో ఇవన్నీ కనిపిస్తున్నాయి. సాధారణంగా కాకలు తీరిన రాజకీయ నాయకులు సైతం జనాల కోసం రూపాయి ఖర్చు పెట్టడానికి వెనుకాడతారు. తరాలుగా పదవులను అనుభవించిన నాయకులు.. ప్రజల కోసం పైసా కూడా ఇవ్వడానికి ఒప్పుకోరు. కానీ నారా లోకేష్ అలా కాదు.. తను అనుకున్నాను అంటే ఏదైనా చేస్తాడు. ఎంత దాకా అయినా వెళ్తాడు. చివరికి డబ్బులను కూడా చేతికి ఎముక లేదన్నట్టుగా ఖర్చు పెడతాడు. పునర్విక ఉదంతం ఉదాహరణ మాత్రమే. నారా లోకేష్ చేసేవి.. చేయాల్సినవి.. చాలా ఉన్నాయి. ఎందుకంటే అతడు ఏపీ ప్రజల మెచ్చిన ప్రజానాయకుడు.
— Lokesh Nara (@naralokesh) April 19, 2026