Pawan Kalyan Varahi Yatra : ఏ ముహూర్తం పవన్ కళ్యాణ్ ‘వారాహి’ బండిని తయారు చేయించాడో కానీ, అప్పటి నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ‘వారాహి’ ఒక సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మారిపోయింది. ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ ఈ వారాహి యాత్ర ని ప్రారంబిస్తాడా అని అభిమానులు మరియు కార్యకర్తలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ వచ్చారు. వారి ఎదురు చూపులకు తెరదించుతూ పవన్ కళ్యాణ్ రీసెంట్ గానే కత్తిపూడి సభతో ‘వారాహి విజయ యాత్ర’ ని ప్రారంభించాడు.
మొదటి మీటింగ్ నుండే ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎండగట్టడం లో పవన్ కళ్యాణ్ సక్సెస్ సాధించాడు. ఆయన యాత్రకి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ప్రతి నియోజగవర్గం లో సభ జరిగే ఒక రోజు ముందు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశాలు ఏర్పాటు చెయ్యడం, ఆ తర్వాత ‘జనవాణి’ కార్యక్రమం ఏర్పాటు చేసి, ప్రభుత్వం ద్వారా నష్టపోయిన ప్రజల గొడ్డుని ప్రపంచం మొత్తానికి తెలిసేలా చెయ్యడం , వీటి అన్నిటినీ బేస్ చేసుకొని మరుసటి రోజు సభలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని కడిగిపారేయడం వంటివి జనాలను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
గడిచిన మీటింగ్స్ తో పోలిస్తే సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ ప్రసంగాలను ఎగబడిమరీ చూసే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. గత సార్వత్రిక ఎన్నికలలో ఈ స్థాయి రీచ్ ఉండేది కాదు. ఇప్పుడు గతం లో ఉన్నదానికంటే డబుల్ రీచ్ పవన్ కళ్యాణ్ ప్రసంగాలకు వస్తున్నాయి. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించని మార్పుకు నాంది అనే చెప్పాలి. ఇది వరకు పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని కేవలం యూత్ మాత్రమే చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు మధ్య వయస్సుకి చెందిన వారి దగ్గర నుండి, పెద్ద వయస్సు ఉన్నవారికి వరకు చూస్తున్నారు అంటే ఆయన మీద జనాల్లో రోజురోజుకి ఆదరణ ఎలా పెరుగుతూ వెళ్తుందో గమనించొచ్చు.
ఇక రేపు కాకినాడ లో జరగబొయ్యే వారాహి విజయ యాత్ర సభ రాష్ట్ర రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఈ సభలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తలపై దౌర్జన్యాలు చేసి, వారిని అసభ్య పదజాలం తో దూషించిన కాకినాడ MLA ద్వారంపూడి కి చుక్కలు చూపించబోతున్నాడు పవన్ కళ్యాణ్, ఈ సభలో ఆయనని ఎలా ఎండగట్టబోతున్నాడో చూసేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.