Pawan Kalyan
Pawan Kalyan ఇక 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తన పార్టీ జనసేన ద్వారా పోటీ చేశారు. త్రిముఖ పోరు లో టిడిపి 23 సీట్లకే పరిమితమైపోయింది. వైసిపి 151 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ స్టామినా ఏమిటో చంద్రబాబు రాజమండ్రి జైలుకు వెళ్లే దాకా టిడిపికి తెలిసి రాలేదు. టిడిపి అధినేతను స్కిప్ డెవలప్మెంట్ స్కీం లో నాటి వైసిపి ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆయనను రాజమండ్రి జైల్లో విచారణ ఖైదీగా ఉంచింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబును పరామర్శించారు. అనంతరం ఎన్నికల్లో జనసేన, టిడిపి కలిసి పోటీ చేస్తుందని ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే జనసేన, టిడిపి కలిసిపోటు చేశాయి. మధ్యలో బీజేపీని కూడా తమకూటమిలో భాగం చేసుకున్నాయి. మొత్తంగా ఎన్డీఏ కూటమిని ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించేలా చేశాయి. కూటమి జోరుకు ఏపీలో వైసిపి 11 సీట్లకే పరిమితమైంది. చివరికి ప్రతిపక్ష హోదాను కూడా దూరం చేసుకుంది. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం గవర్నర్ ప్రసంగాన్ని కూడా బాయ్ కాట్ చేసి బయటికి వచ్చింది..
15 సంవత్సరాలు కలిసే ఉంటాం
“కూటమిలో జనసేన, టిడిపి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఆ రెండు పార్టీలు మాకు మేమే.. మీకు మీరే అన్నట్టుగా వ్యవహరించబోతాయి. పవన్ కళ్యాణ్ ద్వారా బిజెపి గేమ్ మొదలు పెడుతుంది. టిడిపిని
ఇరకాటంలో పడేస్తుందని” ఇటీవల ఓ వర్గం మీడియా రాయడం మొదలుపెట్టింది. అయితే వీటిపై నిన్నటి వరకు టిడిపి, జనసేన నేతలు స్పందించలేదు. అయితే మంగళవారం జరిగిన శాసనసభ సమావేశంలో పవన్ కళ్యాణ్ స్పందించారు. ” నన్ను తిట్టినా కొట్టినా.. 15 సంవత్సరాలు కూటమి ఏపీలో అధికారంలోకి వస్తుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. గవర్నర్ కు గౌరవం ఇవ్వని పార్టీ శాసనసభలోకి ప్రవేశించకూడదు. అధికారంలోకి అసలు రాకూడదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేము కలిసే ఉంటాం. కలిసే ప్రయాణం సాగిస్తాం. ఒకటి కాదు, రెండు కాదు 15 సంవత్సరాలపాటు ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తాం. ఇందులో నాకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. ఎన్నో తిట్లు భరించాను. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాను. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నేను పోరాడుతూనే ఉంటాను. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే ఉంటానని” పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ శాసనసభలో మాట్లాడిన మాటలు ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించాయి. అంతేకాదు కూటమి కకావికలం అయిపోతుందని చెబుతున్నవారికి స్వచ్ఛమైన సమాధానం పవన్ కళ్యాణ్ మాటల ద్వారా లభించింది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నంతసేపు శాసనసభలో నారా లోకేష్, చంద్రబాబు నాయుడు బల్లలు చరిచి తమ సంఘీభావాన్ని తెలిపారు. మొత్తానికి మేమంతా ఒకటే అనే సంకేతాలు ఇచ్చారు.
Pawan Kalyan‘s Key Announcement About Issues In Alliance
కింద పడతాం… మీద పడతాం… నన్ను ఒక మాట అన్నా సరే… అది మా కుటుంబ విషయం…
ఏం జరిగినా మేము 15 సంవత్సరాలు కలిసే ఉంటాం… వైసిపీని సభలో అడుగుపెట్టనివ్వం, అధికారంలోకి రానివ్వం. #TDPJanasena pic.twitter.com/2kuXxxgP7p
— M9 NEWS (@M9News_) February 25, 2025