Pawan Kalyan : కెనడాలోని హిందూ ఆలయం పై దాడి జరిగింది. దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎక్కడ హిందువులకు రక్షణ కల్పించేలా కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. తీవ్రస్థాయిలో ఎమోషనల్ అయ్యారు.ఇప్పటికే సనాతన ధర్మ పరిరక్షణ గురించి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు పవన్. ఈ నేపథ్యంలో విదేశాల్లో హిందువులపై దాడి జరగడాన్ని సీరియస్ గా తీసుకున్నారు. హిందువుల పై దాడులు జరుగుతుంటే అంతర్జాతీయ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్జీవోలతోపాటు ప్రపంచ నాయకులు స్పందించాలని డిమాండ్ చేశారు. ఇతర మతాల పట్ల వ్యవహరించే రీతిలోనే.. హిందువులపై దాడుల అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని కోరారు.పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ వంటి చోట్ల హిందువులపై వేధింపులు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే హిందువుల సంఖ్య తక్కువగా ఉందని.. అందుకే సులభంగా టార్గెట్ చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఈరోజు కెనడాలో హిందూ దేవాలయం పై జరిగిన దాడి నా హృదయానికి తాకిందంటూ బాధ వ్యక్తం చేశారు. కెనడా ప్రభుత్వం హిందూ సమాజానికి భద్రత కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన ఈ ట్విట్ విపరీతంగా వైరల్ అవుతోంది.
* రెచ్చిపోతున్న ఖలిస్తానీలు
మరోవైపు కెనడాలో ఖలిస్తానీలు మరోసారి రెచ్చిపోయారు. బ్రాంప్టన్ ప్రాంతంలో ఉన్న ఓ హిందూ ఆలయం పై దాడి చేశారు. ఆలయంలోని భక్తులపై దాడులు చేస్తున్న వీడియోలు సైతం వైరల్ అయ్యాయి. దీంతో ఆలయం వద్ద భారీగా భద్రతా దళాలను మొహరించారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం దీనిని స్పందించారు. కెనడాలో అన్ని మతాల హక్కులను కాపాడుతామని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. కెనడా ప్రభుత్వానికి ప్రత్యేక విన్నపాలు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎమోషనల్ ట్విట్ పెట్టారు.
* దానిపై బలమైన చర్చ
సనాతన ధర్మ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక వ్యవస్థ రావాలని ఆకాంక్షించిన సంగతి తెలిసిందే. దేశంలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం పవన్ పరితపిస్తున్నారు. దీనికి దేశవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతోంది. తాజాగా బీహార్ లో సైతం పవన్ ప్రస్తావన వస్తోంది. ఇటువంటి సమయంలో అంతర్జాతీయంగా హిందువులపై దాడులు పెరుగుతుండడం పై పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ చెబుతున్న సనాతన ధర్మ పరిరక్షణపై బలమైన చర్చ జరుగుతోంది.
It pains me deeply to see our Hindu brothers and sisters enduring persecution, violence, and unimaginable suffering in places like Pakistan, Afghanistan, and recently, Bangladesh. Hindus are a global minority, and as such, they receive little attention, little solidarity, and are…
— Pawan Kalyan (@PawanKalyan) November 4, 2024
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Pawan kalyans emotional tweet said that a strong system is needed to protect hindu dharma
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com