Pawan Kalyan Vs Telangana Ministers: గత కొద్దిరోజులుగా ఒక పరిణామం తెలుగు రాష్ట్రాల్లో హైలెట్ అయింది. తెలంగాణను పవన్ కళ్యాణ్( Pawan Kalyan) దూషించారని ఆ ప్రాంతం నేతలు విమర్శలు చేస్తున్నారు. కోనసీమ కొబ్బరి పంటను పరిశీలించిన క్రమంలో సాధారణంగానే మాట్లాడారు పవన్. తెలంగాణ దిష్టి తగిలిందని వ్యాఖ్యానించారు. వ్యతిరేక భావనతో ఆ మాట అనలేదు. కేవలం సందర్భోచితంగా మాత్రమే సంబోధించారు. దానిని పట్టుకుని తెలంగాణ నేతలు విమర్శలు చేస్తున్నారు. ముందుగా బిఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి మాట్లాడారు. తరువాత తెలంగాణ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి విమర్శలకు దిగారు. మరోవైపు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పవన్ కళ్యాణ్ సినిమాలను ఆడించమని తేల్చేశారు. క్షమాపణలు చెప్పాల్సిందేనని కోరారు. గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో జనసేన ఈరోజు స్పందించింది. పవన్ వ్యాఖ్యలను వక్రీకరించారని.. అందరూ గమనించాలని కోరుతూ ఒక ప్రకటన జారీ చేసింది. అయితే ఇంతటితో ఆగితే పరవాలేదు కానీ.. పవన్ కళ్యాణ్ ను కెలికితే మాత్రం చాలా రకాల పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
Also Read: ఈ లోపాలు అధిగమిస్తేనే.. “రాయ్ పూర్” సొంతమయ్యేది!
* పవన్ కళ్యాణ్ ను నిందించినందుకే..
ప్రస్తుతం కాపులు( kapu community ) పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు. గతంలో ఎప్పుడూ కాపులకు ఈ స్థాయిలో గుర్తింపు రాలేదు. పవన్ కళ్యాణ్ నేరుగా ముఖ్యమంత్రి కాకపోవచ్చు కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన కృషి ఉంది. అందుకే పవన్ ను కాపుల ప్రతినిధిగా ఆ సామాజిక వర్గం వారు చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తో వైరం తెచ్చుకుంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయా పార్టీలకే నష్టం. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ ను వైయస్సార్ కాంగ్రెస్ నేతలు విపరీతంగా ద్వేషించడంతోనే కాపుల్లో ఆయన పట్ల విపరీతమైన సానుభూతి కనిపించింది. అదే 2024 ఎన్నికల్లో ప్రభావితం చేసింది. అది తెలంగాణకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే అక్కడ కాపులు కూడా పవన్ కళ్యాణ్ ను చూసి సంతృప్తి చెందుతున్నారు.
* కాంగ్రెస్కు కాపుల అండ..
మొన్నటి జూబ్లీహిల్స్( Jubilee Hills ) ఎన్నికల్లో జనసేన బిజెపికి మద్దతు తెలిపింది కానీ.. చంద్రబాబు సన్నిహితుడైన రేవంత్ నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైపు కాపు సామాజిక వర్గం నిలిచింది. కేవలం చంద్రబాబును పవన్ కళ్యాణ్ ద్వారా గౌరవం ఇస్తుంది కాపు సామాజిక వర్గం. అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గమంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసింది. ఆ విషయాన్ని మరిచిపోయి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తో పాటు మంత్రి ఆతరహా వ్యాఖ్యానాలు చేయడం ఏమిటనేది అర్థం కావడం లేదు. వారు జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులైన కావచ్చు. ఏపీలో రెడ్డి సామాజిక వర్గాన్ని గద్దె దించి చంద్రబాబును అధికారంలోకి తెచ్చారన్న బాధైనా ఉండవచ్చు. పైగా విమర్శలు చేస్తున్న వారంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. ఇదే పరిస్థితి కొనసాగితే అక్కడ కాపు సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అయ్యే అవకాశం ఉంది. లేని వివాదాలతో పవన్ కళ్యాణ్ ను కెలికితే అది అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం. అయితే రేవంత్ ను నష్టం చేకూర్చేందుకుగాను ఇలా వ్యవహరించారా అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై అంతిమంగా తేల్చుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ.