Pawan Kalyan Vs Bonda Uma: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. అయినా సరే కూటమి పార్టీల ఎమ్మెల్యేలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలో గట్టి వాదనలే జరుగుతున్నాయి. ఈరోజు శాసనసభలో చాలా అంశాలు హైలెట్ అయ్యాయి. అయితే అధికార టిడిపికి చెందిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు.. ఏకంగా పవన్ కళ్యాణ్ నిర్వర్తిస్తున్న శాఖపై విమర్శలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఓ అంశంపై బోండా ఉమామహేశ్వరరావు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. తనలో ఉన్న అసంతృప్తిని బయటపెట్టారు. ఇప్పుడిదే హాట్ టాపిక్ అవుతోంది.
* కాలుష్య నియంత్రణ శాఖపై విసుర్లు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తో పాటు అటవీ శాఖను నిర్వహిస్తున్నారు. పర్యావరణ శాఖను కూడా తన పరిధిలో ఉంచుకున్నారు. అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్లక్ష్యం పై ప్రశ్నించారు బోండా ఉమామహేశ్వరరావు. అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో టాస్క్ఫోర్స్ గాని, నెంబర్ సెక్రెటరీ కానీ.. ఎక్కడా కూడా పనిచేస్తున్నట్లు కనిపించట్లేదు అంటూ తేల్చి చెప్పారు. ఏదైనా పని కోసం వెళ్తే డిప్యూటీ సీఎం పేరు చెబుతున్నారని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం చేయొద్దంటున్నారని.. ఆయన కార్యాలయం నుంచి చెప్పాలి అని చెబుతున్నారని.. ఆయన కలవట్లేదని స్వయంగా కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ చెబుతున్నారని ఉమామహేశ్వరరావు ప్రస్తావించారు. ప్లాస్టిక్ నిషేధం పై ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా మంచి విషయాలు చెప్పారని.. వాటిని ఆచరించాల్సిన అవసరం ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకు ఉందన్నారు. కాలుష్య నియంత్రణ మండలి గాడి తప్పినట్లు కనిపిస్తోందంటూ ప్రస్తావించారు.
* వైసీపీ ఎంపీ పేరు ప్రస్తావిస్తూ..
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి పేరు చెప్పి కాలుష్య నియంత్రణ మండలి పనితీరును ప్రశ్నించారు ఉమామహేశ్వరరావు. విశాఖలో రాంకీ పరిశ్రమ నుంచి రసాయనక, ఫార్మా వ్యర్థాలను నేరుగా సముద్రంలోకి వదులుతున్న విషయాన్ని పేర్కొన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు ఆదేశాలను సైతం పాటించడం లేదని చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ సమక్షంలోనే ఆయన నిర్వర్తిస్తున్న శాఖపై బోండా ఉమ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డుపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా pic.twitter.com/Sef9xkT1Pm
— ChotaNews App (@ChotaNewsApp) September 19, 2025