Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: పవన్ వచ్చాడు.. చనిపోతుందనుకున్న పాప బతికింది.. ఈ అద్భుతం ఎక్కడ జరిగింది అంటే..

Pawan Kalyan: పవన్ వచ్చాడు.. చనిపోతుందనుకున్న పాప బతికింది.. ఈ అద్భుతం ఎక్కడ జరిగింది అంటే..

Pawan Kalyan: హనుమకొండలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న నిరంజన్ ను పరామర్శించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంతే కాదు త్వరలో ఓజీ 2 చిత్రంలో నటించాలని అతడికి ఆఫర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ రాకతో నిరంజన్ ఆనందంతో కనిపించాడు. అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్న అతడు.. పవన్ కళ్యాణ్ ను చూడాలని.. తన కోరికను వ్యక్తం చేశాడు. అభిమానుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న పవన్.. వెంటనే నిరంజన్ వద్దకు వచ్చాడు. భద్రకాళి అమ్మవారి ప్రసాదం.. అక్షింతలు పట్టుకొని అతడికి ఇచ్చాడు.

కేవలం నిరంజన్ విషయంలోనే కాదు.. తన అభిమానులు.. ఆపదలో ఉంటే ఎక్కడ దాకైనా పవన్ కళ్యాణ్ వస్తూ ఉంటారు. సరిగ్గా 14 సంవత్సరాల క్రితం ఖమ్మం నగరంలో కార్తీక్ న్యూరో హాస్పిటల్ లో.. శ్రీజ అనే బాలిక మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. అప్పటికీ ఆమె ఆ చేతనంగా మారిపోయింది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. శ్రీజ తండ్రి కేటీపీఎస్ లో ఉద్యోగి.

శ్రీజకు పవన్ కళ్యాణ్ ను చూడాలని కోరిక. తన కుమార్తె చివరి కోరికను నెరవేర్చాలని శ్రీజ తండ్రి పవన్ కళ్యాణ్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న పవర్ స్టార్.. ఖమ్మం నగరం వచ్చారు. కార్తీక్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీజను చూసి కన్నీరు పెట్టుకున్నారు. కోలుకుంటావని ఆమె చెవిలో చెప్పారు. ఆమె తల్లిదండ్రులకు ధైర్య వచనాలు కల్పించారు. చాలాసేపు పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నారు. నాడు కార్తీక్ హాస్పిటల్ అధినేత డాక్టర్ అసాధారణ్ తో పవన్ మాట్లాడారు. శ్రీజ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.

పవన్ పరామర్శించి వెళ్లిన తర్వాత శ్రీజ కొద్ది రోజులకే కోలుకుంది. ఆ తర్వాత సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అయింది. ఇప్పుడు ఆమె ఉన్నత చదువులు చదువుతోంది. అంతేకాదు అప్పట్లో జనసేన పార్టీని ఏర్పాటు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ను శ్రీజ కలిసింది. పార్టీకి తన వంతుగా విరాళం కూడా ఇచ్చింది.. అభిమానులు కష్టాల్లో ఉంటే పవన్ కళ్యాణ్ కరిగిపోతారు. ఎంత దాకా అయినా వచ్చి వారిని పరామర్శిస్తారు. మిగతా హీరోలకు హిపోక్రసీ ఉంటుంది. కాని పవన్ అదేమీ చూపించడు. తాను డౌన్ ఎర్త్ కాబట్టి అలానే ఉంటాడు. అప్పుడు శ్రీజ.. ఇప్పుడు నిరంజన్.. అభిమానులు మాత్రమే మారారు.. వారి కష్టాల్లో అండగా ఉండేందుకు వచ్చిన పవన్ మాత్రం అలానే ఉండిపోయారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular