Pawan Kalyan: రాజకీయాలు అంత ఈజీ కాదు.. అదీ దక్షిణ భారత దేశంలోని తెలుగు రాష్ట్రాల్లో మరింత కష్టం. కొత్తగా రాజకీయాల్లోకి రావడానికి చాలా మంది ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం ఉన్న నేతల వారసులే.. తిరిగి ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్నారు. ఇందుకు గడ్డం వెంకటస్వామి కుటుంబమే నిదర్శనం. వెంకటస్వామి తర్వాత ఆయన కొడుకులు వివేక్, వినోద్ రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు వివేక్ కొడుకు వంశీకృష్ణ పెద్దపెల్లి ఎంపీగా పోటీచేసి గెలిచారు. కొత్తగా రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి ఉన్నవారు కూడా రాణించలేకపోతున్నారు. నిలదొక్కుకునే పరిస్థితులు నేటి రాజకీయాల్లో లేవు. అందుకే చాలా మంది రాజకీయం అంటేనే కంపు.. బురద అని భావిస్తున్నారు. దానిని అంటించుకోకపోవడమే మంచిదనుకుంటారు. కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ మాత్రం ఆ బురదనే అంటించుకున్నారు. 2008 అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లో అడుగు పెట్టారు. తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో పవన్ కళ్యాణ్ కాంగ్రెస్‌లో చేరలేదు. రాజకీయాల్లో అడుగు పెట్టాక వెనుకడుగు వేయడం సరికాదని భావించి సొంత పార్టీ జనసేనను స్థాపించారు. దశాబ్దం పాటు రాజకీయాల్లో ఆటుపోట్లు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆయనకు ఉన్న స్టార్ ఇమేజ్. డబ్బులు, ఫ్యాన్స్ కలిసి వచ్చాయి. చివరకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలో కలిసి పోటీ చేసి కూటమిగా విజయం సాధించారు. కే ంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో బాగస్వామి అయ్యారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మంత్రివర్గంలో మూడు శాఖలు నిర్వహిస్తున్నారు.
లగ్జరీ లైఫ్ నుంచి బురదోల నడిచే వరకు…
పది రోజులుగా ఏపీని వర్షాలు కుదిపేస్తున్నాయి. విజయవాడను వరదలు ముంచేశాయి. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఇటీవల తన సొంత నియోజకవర్గం పిఠాపురంలోని కొన్ని ప్రాంతాలలో పర్యటించారు, ఆ ప్రాంతంలో వరద పరిస్థితిని అంచనా వేయడానికి వెళ్లారు. పొంగిపొర్లుతున్న నీళ్లలో నడుస్తూ కనిపించడంతో ఆయన దుస్తులు దెబ్బ తిన్నాయి. ప్రవహించే బురద నీళ్లతో ప్యాంటు కింది భాగం తడిసిపోయి కనిపించింది. ఈ వీడియో వెంటనే సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం ప్రారంభించారు జన సైనికులు.. ఇటీవలి సినిమాలో కాళ్లకు ఖరీదైన షూ ధరించిన ఫొటోను ఒకవైపు.. మరోవైపు బురదలో నడుస్తున్న కాళ్లను మరోవైపు పెట్టి.. వైరల్ చేస్తున్నారు. ఃఅతను కలిగి ఉన్న జీవితం … అతను ఎంచుకున్న జీవితం …’ అని దానికి క్యాప్షన్ ఇచ్చారు.
ప్రజల పక్షాన నిలవాలని..
అయితే, ఇక్కడ కఠినమైన వాస్తవం ఏమిటంటే, ఇది పవన్ చేసిన స్పృహతో కూడిన ఎంపిక మరియు పవన్ తన సామాజిక శ్రేయస్సు కోరికలను పరిగణనలోకి తీసుకుని, తన సినిమా జీవితం కంటే ఈ కఠినమైన జీవితాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని కూడా వాదించవచ్చు. ఇందుకోసం పదేళ్లు రాజకీయాల్లో అనేక ఇబ్బందులు పడ్డారు. నిర్బంధాలను ఎదుర్కొన్నారు. వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగానూ విమర్శలు తప్పలేదు. అయినా ప్రజల కోసం వాటిని ఎదురించి.. నిలబడి విజేతగా నిలిచారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Pawan kalyan visited the flood affected areas of vijayawada
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com