Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రావడానికి ముఖ్యకారణం జగనేనని ఆరోపణలు చేశారు. మూడో విడత వారాహి యాత్రలో భాగంగా విశాఖ జగదాంబ కూడలిలో ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ‘హైదరాబాద్ లో దౌర్జన్యాలు ఎక్కువ చేస్తుంటే ఆంధ్రావాళ్లను తన్ని తరిమేశారు. దానికి ముఖ్య కారణం జగన్. వైసీపీని తన్ని తరిమే వరకు నిద్రపోను. చూడటానికి పలుచగా ఉంటాను. కానీ నా ఒళ్లు మందం. వైసీపీకి ఓటేస్తే కొండలు తవ్వేస్తారని గొంతు చించుకొని మరీ చెప్పా.. కానీ ప్రజలు పట్టించుకోలేదు’ అని విమర్శించారు.
విశాఖ జగదాంబ సెంటర్ లో 25 ఏళ్ల క్రితం సుస్వాగతం సినిమా చేశానని.. మళ్లీ ఇప్పుడు ప్రజల కోసం ఇక్కడే వారాహి సభలో మాట్లాడుతున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సంస్కృతి , సాహిత్యం విశాఖ నేర్పిందన్నారు. మూడో విడత వారాహి యాత్రలో భాగంగా విశాఖ జగదాంబ కూడలిలో ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
సీఎం జగన్ నాయకుడు కాదని.. ఓ వ్యాపారి అని పవన్ ధ్వజమెత్తారు. ప్రతి పనిలో వాటా ఎంత అని అడిగేంతలా ఆయనకు డబ్బు పిచ్చి ముదిరిందని విమర్శించారు. మరోసారి జగన్ కు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరన్నారు. చాలా ప్రశాంతమైన నగరం విశాఖ ఈరోజు గుండాలు, కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ రాబంధుల చేతుల్లో చిక్కుకొని విలవిలలాడుతోందన్నారు.
https://www.youtube.com/watch?v=jQY1AM341nY