Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Tamil Nadu politics: తమిళనాడుకు పవన్.. బిజెపి గట్టి ఆలోచన

Pawan Kalyan Tamil Nadu politics: తమిళనాడుకు పవన్.. బిజెపి గట్టి ఆలోచన

Pawan Kalyan Tamil Nadu politics: తమిళనాడులో( Tamil Nadu ) హోరాహోరీ పోరు కొనసాగుతోంది. డీఎంకే కూటమితో అన్నాడీఎంకే కూటమి గట్టిగానే తలపడుతోంది. ఇంకోవైపు విజయ్ టీవీ కేసైతం అదృష్టం పరీక్షించుకుంటోంది. పొత్తులో భాగంగా బిజెపికి 27 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు పెంచుకుంటూ వచ్చింది బిజెపి. అందుకే ఈసారి అన్నా డిఎంకెతో కలిసి పోటీ చేస్తోంది. ఓట్లు మాత్రమే కాదు సీట్లు కూడా పెంచుకోవాలని చూస్తోంది. అందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడుచుకోవడం లేదు. అయితే బిజెపికి మద్దతుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారు. ఈరోజు కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. అక్కడ బిజెపి అభ్యర్థి ఎం ఆర్ గాంధీకి మద్దతుగా పవన్ రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొంటారు. ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ సేవలను వినియోగించుకోవాలని బిజెపి భావించిన విషయం తెలిసిందే.

తెలుగు ప్రజలు ఉండే ప్రాంతాల్లో..
ముఖ్యంగా తెలుగు ప్రజలు అధికంగా నివాసం ఉండే నియోజకవర్గాల్లో పవన్ ( deputy CM Pawan Kalyan) పర్యటనలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. తద్వారా గెలుపు అవకాశాలను సజీవం చేసుకోవాలని చూస్తోంది బిజెపి. మరోవైపు పవన్ కళ్యాణ్ పర్యటన కోసం నాగర్ కోయిల్ లో భారీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా యువత, ఫ్యాన్స్ అధికంగా ఉండే నియోజకవర్గాల్లో పవన్ పర్యటన ఉండేలా రోడ్ మ్యాప్ లో సిద్ధం చేస్తున్నారు.. హోసూరు, చెన్నై పరిసరాల్లోని మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా పవన్ ప్రచారం చేయాలని బిజెపి అగ్ర నాయకత్వం కోరింది. పవన్ కళ్యాణ్ ఏ రాష్ట్రంలో ప్రచారం చేసినా అక్కడ బిజెపికి సానుకూల ఫలితాలు వస్తూ వచ్చాయి. అందుకే బిజెపి అగ్ర నేతలు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ వచ్చారు.

తరచూ పర్యటనలు..
అయితే పవన్ కళ్యాణ్ కేవలం ఇప్పుడు మాత్రమే కాదు. గతంలో నుంచి ఆయన తమిళనాడు విషయంలో ప్రత్యేక పాత్ర పోషిస్తూ వచ్చారు. తరచూ ఆ రాష్ట్రంలో పర్యటనలు చేస్తూ వచ్చారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక బలమైన హిందుత్వ అభివృద్ధి కోరుకునే నేతగా పవన్ ఇప్పటికే ప్రొజెక్టు అయ్యారు. తమిళ రాజకీయాల్లో కూడా ముద్ర చాటిల ఇప్పుడు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మరోవైపు నాగర్ కోయిల్ లో పర్యటన దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఇక్కడ బిజెపి అభ్యర్థి ఎం ఆర్ గాంధీకి మంచి పట్టు ఉంది. దానికి పవన్ చరిష్మ తోడైతే కచ్చితంగా బిజెపి విజయం సాధించే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular