Pawan Kalyan gifts to teachers: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రజలతో మమేకం అయ్యేందుకు ఆయన వెళుతున్న మార్గం ప్రత్యేకమే. ఇప్పటివరకు గిరిజనులకు చెప్పులు, తన ఫామ్ హౌస్ లో పండిన మామిడి పండ్లను అందించి పెద్ద మనసు చాటుకున్నారు. గిరిజనుల ఆహ్వానం మేరకు ఈనెల ఐదున అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగే గిరిజన వేడుకల్లో పాల్గొనన్నారు పవన్. మరోవైపు రేపు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులకు సర్ప్రైజ్ గిఫ్టులు పంపించారు. పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీలో పనిచేసే రెండు వేల మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు కానుకలను పంపించారు, మహిళలకు చీరలు, పురుషులకు ప్యాంటు షర్టులు పంపిణీ చేశారు. ఒక ప్రత్యేక టీం పాఠశాలల వారీగా వాటిని అందజేసింది.
టీచర్ల ఆనందం
అయితే ఒక స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం తమకు బహుమతులు పంపడంపై ఉపాధ్యాయులు, అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానుకలను పంపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గత నెలలో శ్రావణమాసం సందర్భంగా కూడా పిఠాపురం మహిళలకు ఇదేవిధంగా కానుకలు పంపించారు. ఎమ్మెల్సీ నాగబాబు భార్య పద్మజ పద్నాలుగు వేల చీరలను పంపిణీ చేశారు. స్థానిక జనసేన నేతలతో కలిసి పద్మజ మహిళలకు చీరలు, పసుపు, కుంకుమలు అందజేశారు. అయితే ఒక్క పిఠాపురం నియోజకవర్గ ప్రజలకే కాదు. గిరిజనులకు సైతం తరచూ కానుకలను పంపించి పెద్ద మనసు చాటుకునేవారు పవన్ కళ్యాణ్. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజనులకు చెప్పులు పంపించారు. తన తోటలో కాసిన మామిడి పండ్లను సైతం గిరిజనులకు పంపారు. ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజనులకు కూడా కానుకలు పంపారు. వారికి రగ్గులు పంపించగా అధికారులు వాటిని పంపిణీ చేశారు.
రేపు అరకుకు పవన్
గిరిజనుల ఆహ్వానం మేరకు సెప్టెంబర్ 5న అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించనున్నారు పవన్. అరకు లోయలోని మదగడ అనే గిరిజన గ్రామానికి వెళ్లారు. అక్కడ గిరిజనులు జరుపుకునే బలి పోరోబ్ ఉత్సవంలో పాల్గొంటారు. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ ఇలా ప్రత్యేకత చాటుతూ.. ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుండడం నిజంగా గొప్ప విషయం.ఏటా 12 రోజులపాటు గిరిజన ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఒడిస్సా కు చెందిన ఆదివాసీల సైతం ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఈ ఏడాది అక్కడి గిరిజనులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. దీంతో పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు.