Deputy CM Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( AP deputy CM Pawan Kalyan )దూకుడు మీద ఉన్నారు. తాజాగా ఆయన గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. అడవి తల్లి బాట పేరుతో దాదాపు గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించాలని కృత నిశ్చయం పెట్టుకున్నారు. ఇందుకు గాను స్వయంగా గిరిజన గ్రామాలకు వెళ్లి గిరిజనులతో మమేకం కానున్నారు. ఒకేసారి గిరిజన ప్రాంతాల్లో 200 రహదారులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించనున్నారు. అయితే ఆయన అటవీ ప్రాంతంలోకి వెళ్లి.. డిప్యూటీ సీఎం హోదాలో శ్రీకారం చుడుతుండడం నిజంగా విశేషమే. ఎందుకంటే అవన్నీ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు. అయినా సరే లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ వెళ్తున్నారంటే ఆయనకు గిరిజన సంక్షేమంపై ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది.
Also Read : ఏపీ సిఐడికి సుప్రీం కోర్ట్ షాక్!
* రోడ్డు మార్గం గుండా అరకుకు..
పవన్ కళ్యాణ్ రెండు రోజులపాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో( Alluri sitaramaraju district ) పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్ట్ కు వెళ్లారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం గూండా అరకు నియోజకవర్గంలోని డుంబ్రిగూడ మండలం చాపరాయి చేరుకుంటారు. అక్కడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరిజన ఆవాస ప్రాంతాన్ని చేరుకుంటారు. అక్కడే అడవి తల్లి బాట పేరుతో రహదారులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ నుంచి డుంబ్రిగూడ మండల కేంద్రానికి చేరుకుని అల్లూరి సీతారామరాజు జిల్లాకు కేటాయించిన 200 రహదారులకు పర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారు పవన్. అనంతరం అరకు వెళ్లి ఓ రిసార్ట్స్ లో బస చేస్తారు.
* రేపు సైతం ఆ ప్రాంతంలోనే..
రేపు సైతం అరకు( Araku) ప్రాంతంలోనే ఉంటారు పవన్ కళ్యాణ్. అరకు సమీపంలోని సుంకరమెట్టలో చెక్కలతో తయారు చేసిన ఖాళీ వంతెనను ప్రారంభిస్తారు. కాఫీ తోటలను సైతం సందర్శిస్తారు. అనంతరం విశాఖలోని ఇందిరాగాంధీ జియో లాజికల్ పార్క్ కు వెళ్లి ఎకో టూరిజానికి సంబంధించి ప్రాజెక్టును ప్రారంభిస్తారు. అయితే రెండు రోజుల పాటు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాల్లో ఉండడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే అవన్నీ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలే. అయినా సరే పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో గిరిజన ప్రాంతాల్లో రహదారులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
* నిజంగా సాహసమే..
అయితే గతంలో ఏ డిప్యూటీ సీఎం కానీ, మంత్రి కానీ అటువైపుగా వెళ్లే సాహసం చేయలేదు. గతంలో టిడిపి హయాంలో.. బాక్సైట్ అనుమతులకు నిరసనగా మావోయిస్టులు ప్రజాప్రతినిధులను దండించిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి చోటకు నిర్భయంగా పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. పైగా డిప్యూటీ సీఎం హోదా.. ఆపై కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి అత్యంత సన్నిహితుడు కూడా. మావోయిస్టు ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపింది. ఇటువంటి తరుణంలో పవన్ గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తుండటంతో.. ఏపీ పోలీసులు ఏజెన్సీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.
Also Read : ఉద్దానంలో ఆగని ‘కిడ్నీ మరణ మృదంగం’!..