Pawankalyan : ఏపీ సీఎం జగన్ పై పవన్ ట్విట్టర్ల దాడి కొనసాగుతోంది. రోజుకో ట్విట్ తో పవన్ కాక రేపుతున్నారు. నిన్న ఓ ట్విట్ తో విరుచుకుపడిన పవన్.. అదే టైటిల్ తో నేడు కూడా విమర్శనాస్త్రాన్ని సంధించారు. ఇవి వైరల్ అవుతుండడంతో అధికార వైసీపీ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. మత్స్యకార భరోసా పంపిణీ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ పవన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ,జనసేన మధ్య పొత్తు అసంబద్ధమైనదని..అవసరమైనప్పుడు పొత్తు పెట్టుకుంటూ.. అవసరం లేనప్పుడు విడాకులు తీసుకుంటున్నారంటూ పవన్, చంద్రబాబులపై ధ్వజమెత్తారు. దీనిపై పవన్ స్పందిస్తూ ట్విట్టర్ లో విమర్శలకు దిగుతున్నారు.
నిన్ననే పాపం పసివాడు సినిమా పేరిట ఒక పోస్టర్ తో ట్విట్ చేశారు. ఎవరైనా జగన్ పెట్టి ఆ సినిమాను రీమేక్ చేయాలన్నారు. అ పోస్టర్ ఎడారిలో ఓ చిన్న పిల్లవాడు సూటుకేసు పట్టుకుని నడుచుకుంటూ పోతున్నట్లుగా ఉంది. ఇందులో చిన్న మార్పు చేయాలని.. జగన్ చేతిలో సూట్ కేసు బదులు సూట్ కేసు కంపెనీలు పెట్టాల్సి ఉంటుందన్నారు. తన అక్రమార్జనను మనీ లాండరింగ్ ద్వారా ఈ సూట్ కేసుల ద్వారా జగన్ పంపుతున్నారని..తాను అమాయకుడిగా నటిస్తున్నరాని పవన్ సెటైర్ వేశారు. అయితే ఈ సినిమా తీయడానికి రాజస్థాన్ ఎడారులకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఏపీలో నదుల్లో తవ్విన ఇసుక పాయింట్ల వద్ద సినిమా తీసుకోవచ్చని సలహా ఇచ్చారు.
దానికి కొనసాగింపుగా నేడు మరో ట్విట్ చేశారు. ఎప్పుడో విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ‘పాపం పసివాడు’ అంటూ టైటిల్ ఉన్న సినిమా పోస్టర్ లాంటి ఫోటోను ట్వీట్ చేశారు. రచన, నిర్వహణ, దర్శకత్వం జగన్ అని అందులో రాసి ఉంది. ఈ ఫోటోని పవన్ ట్వీట్ చేస్తూ ‘పాపం పసివాడు.. నోట్లో వేలు పెట్టినా కొరకలేడు’ అని నోట్ ని యాడ్ చేశారు. ఫోటోలో జగన్ పక్కనే హెలికాప్టర్, చేతిలో డబ్బులు నింపుకున్న సూట్ కేసులు పట్టుకొని ఎడారిలో నడిచి వెళుతున్నట్టు ఈ ఫోటోను డిజైన్ చేశారు. గత కొంతకాలంగా జగన్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోతుందంటూ పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా ఈ ఫోటోను రూపొందించి ట్విట్ చేశారు.
పవన్ చేసిన ట్విట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. జన సైనికులు, అభిమానులు స్ట్రాంగ్ గా రియాక్డవుతున్నారు. ట్రోల్ చేస్తున్నారు. కామెంట్లు పెడుతున్నారు. డిజైన్ బాగుందంటూ వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. అయితే వైసీపీ శ్రేణులు సైతం స్పందిస్తున్నాయి పవన్ చర్యలను తప్పుపడుతున్నాయి. మొత్తానికైతే పవన్ రియాక్షన్ తో వైసీపీ మైండ్ బ్లాక్ అవుతోంది.
పాపం పసివాడు, నోట్లో వేలు పెడితే కొరకలేడు… pic.twitter.com/gUIdqZ5NlG
— Pawan Kalyan (@PawanKalyan) May 17, 2023