Pawan Kalyan: చాలా సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీ కి రాజకీయాలకి మధ్య అవినాభావ సంభందాలు ఉండటం మనం చూస్తూనే వచ్చాం.ముఖ్యంగా ఇది సీనియర్ ఎన్టీయార్ గారు తెలుగు దేశం పార్టీ పెట్టినప్పటి నుండి అటు సినిమావాళ్లు, ఇటు రాజకీయ నాయకులు అందరూ కూడా కలుసుకుంటూ తిరిగేవారు అలాంటి సందర్భంలోనే ఎవరికి ఏ అపద వచ్చిన అటు రాజకీయ నాయకులు ఇటు సినిమా వాళ్ళు అందరూ స్పందించే వారు…ఇక ఇది ఇలా ఉంటే రీసెంట్ గా రోజాని తెలుగు దేశం పార్టీ నాయకులు చాలా అసభ్యంగా తిడుతూ మాట్లాడారు దాంతో ఆమె కి సపోర్ట్ గా రాధిక గారు మాట్లాడటం జరిగింది. ఆమె మాట్లాడుతూ మీరు అసలు మనుషుల ఒక మహిళ మంత్రి ని అలా తిడుతారా మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అలా తిడితే మీరు ఊరుకుంటారా? మీరు మాట్లాడిన మాటలకు గాను వెంటనే రోజా గారికి మీరు సారి చెప్పాలి అంటూ ఆమె చాలా ఘాటు గా రియక్ట్ అవ్వడం.జరిగింది…ఇక ఈ విషయం మీద కుష్బూ గారు కూడా స్పందించారు. ఇక రాధిక మాట్లాడుతూ ఈ విషయం లో రోజా గారికి తెలుగు దేశం.నాయకులతో పాటు పవన్ కళ్యాణ్ కూడా సారీ చెప్పాలని ఆమె అన్నారు…
అయితే ఈ విషయం మీద రీసెంట్ గా ప్రెస్ మెట్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తూ మనం ఎవరికి సారీ చెప్పాల్సిన పని లేదు అని రాధిక గారికి కౌంటర్ ఇచ్చారు.ఇక చంద్రబాబు అరెస్టుకు సినిమావాళ్లు ఎవరు స్పందించడం లేదు అనే ప్రశ్న కి పవన్ కళ్యాణ్ సమాధానం గా సినిమా వాళ్ళు వచ్చి కలిసి వెళ్లిన వెంటనే అధికార పార్టీ నాయకులు వాళ్ల మీద ఎదురు దాడి చేస్తారు. రీసెంట్ గా రజిని కాంత్ లాంటి నాయకుడు చంద్రబాబు గురించి ఏదో నాలుగు మాటలు పాజిటివ్ గా మాట్లాడితే ఆయన్నే నానా బూతులు తిట్టారు ఈ నాయకులు… దేశంలోనే చాలా పెద్ద నటుడు అయిన ఆయనే వీళ్ళ భారీ నుంచి సెక్యూర్ చేసుకోలేకపోయారు ఇక చిన్న చిన్న వాళ్ళని వీళ్ళు ఎలా పిక్కుతింటారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే సినిమా ఇండస్ట్రీ లో కూడా రాజకీయానికి సంబంధించి రెండు వర్గాలు ఉంటాయి అది ఇప్పటి నుంచే కాదు రామారావు గారు తెలుగు దేశం పార్టీ పెట్టినప్పుడు అప్పటి నటులు అయిన కృష్ణ గారు కానీ, ప్రభాకర్ రెడ్డి గారు కానీ వీళ్లంతా కాంగ్రెస్ కి సపోర్ట్ గా ఉన్నారు…
ఆయన మీద చాలా సినిమాలు కూడా తీశారు ఆయన్ని తక్కువ చేసి చూపించారు అలాంటి ఒక నేపద్యం ఉన్న ఈ రాజకీయాల్లోకి పసి మొక్కల లాంటి సినిమా స్టార్లను లాగడం కరెక్ట్ కాదు అని చెప్పాడు అలాగే ఎవరో ఒకరు నా లాంటి తిక్క ఉన్న వాళ్లు అయితే ఏది అయితే అది అవుతుంది అని బయటికి వచ్చి మాట్లాడుతారు కానీ నార్మల్ నటులు అయితే ఈ వైసిపి నాయకుల ఎటాక్ నుంచి తప్పించుకోవడం కష్టం అవుతుంది అని అన్నారు…