Pawan Kalyan promise: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan ) ఆలోచన భిన్నంగా ఉంటుంది. దీనిపైన ధ్యాస పెట్టారంటే దానిని ముగించే దాకా వదలరు. మొన్నటికి మొన్న అంధ మహిళా క్రికెటర్లకు సొంత డబ్బును ఇచ్చారు. వారిలో పేదరికం అనుభవిస్తున్న వారికి ఇంటికి నేరుగా గృహోపకరణాలను పంపించారు. పవన్ కళ్యాణ్ అనుకుంటే ప్రభుత్వం తరుపున సాయం చేయవచ్చు. కానీ ఆయన అలా చేయడం లేదు. తన సొంత డబ్బును అందించి ఉదారతను చాటుకుంటున్నారు. తాజాగా ఓ పట్టణంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారు. పది రోజుల వ్యవధిలోనే వారి కోరిక మేరకు వసతులను సమకూర్చారు. ఈ విషయంలో ఉన్న తన ప్రత్యేకతను చాటుకున్నారు పవన్ కళ్యాణ్. అయితే అధికారంలోకి రాక మునుపు కూడా వేలాది మంది రైతులకు సాయం చేసిన చెయ్యి అది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పరంపరను కొనసాగిస్తున్నారు. నిజంగా ఇది అభినందించదగ్గ విషయం.
పది రోజుల వ్యవధిలో..
చిలకలూరిపేటలో ( chilakaluripeta )శ్రీ శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది. ఈనెల ఐదున మెగా టీచర్స్ పేరెంట్ మీటింగ్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే అక్కడి విద్యార్థులు తమకు అత్యున్నతమైన లైబ్రరీ తో పాటు కంప్యూటర్లు కావాలని కోరారు. అయితే దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత అందిస్తానని హామీ ఇచ్చారు. పది రోజుల వ్యవధిలోనే ఆ పాఠశాలకు లైబ్రరీ వసతి తో పాటు 25 కంప్యూటర్లను సొంత నిధులతో అందించి ఉదారత చాటుకున్నారు పవన్ కళ్యాణ్. పాఠశాలలో పుస్తకాలు అరకొరగా ఉండడాన్ని గుర్తించారు. అందుకే గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని.. కంప్యూటర్లు అందిస్తానని హామీ ఇచ్చారు. పది రోజుల్లోనే ఆ మాటను నిలబెట్టుకున్నారు.
ఉప్పాడ మత్స్యకారులకు..
ఉప్పాడ( Upada) మత్స్యకారుల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. వంద రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తీరంలో ఉన్న పరిశ్రమలతో మత్స్య సంపదకు నష్టం వాటిల్లుతోందని మత్స్యకారులు ఆందోళన బాట పట్టారు. ఆ సమయంలో 100 రోజులు సమయం ఇస్తే పరిష్కార మార్గం చూపిస్తామని హామీ ఇచ్చారు పవన్. అయితే స్థానిక మత్స్యకారులను తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు పంపించారు. రెండు బృందాలుగా విభజించి పంపించారు పవన్. అక్కడ అదునా అతను కేజ్ కల్చర్, రిఫ్ కల్చర్, మార్కెటింగ్ వ్యవస్థల ఏర్పాటు పై మత్స్యకారులకు శిక్షణ ఇవ్వనున్నారు. అక్కడి హార్బర్ల సందర్శన, హేచరీలలో చేపల గుడ్లు పొదిగించడం వంటి వాటిపై కూడా శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తానికి అయితే పవన్ మాట ఇచ్చారంటే అంతే.