Pawan Kalyan: రాజకీయ నాయకుల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) శైలి ప్రత్యేకంగా ఉంటుంది. ఆది నుంచి ప్రజల విషయంలో ఆయన ఉదారంగా వ్యవహరిస్తూ వచ్చారు. విపక్షంలో ఉన్నప్పుడు కౌలు రైతుల సంక్షేమానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలకు లక్ష చొప్పున అందజేశారు. వందలాది కుటుంబాలకు ఇదే మాదిరిగా సాయం చేస్తూ వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా సాయం చేయడమే కాదు.. తన సొంత నిధులను సైతం పవన్ కళ్యాణ్ ప్రజల కోసమే కేటాయిస్తున్నారు. తాజాగా అనాధ పిల్లలకు తన జీతభత్యాల మొత్తాన్ని కేటాయించారు. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఓ 42 మంది అనాధ పిల్లలకు నెలకు 5000 రూపాయల చొప్పున అందించేందుకు నిర్ణయించారు. మొన్నటికి మొన్న గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు పాదరక్షలు అందించారు. ఇలా తన ఉదారత చాటుకుని వస్తున్నారు పవన్ కళ్యాణ్.
Also Read: పాక్ పై పట్టరాని ఆగ్రహం..ఈ బుడ్డోడు ఏం చేశాడంటే.. రోమాలు నిక్కబొడిచే వీడియో ఇది!
* అమ్మవారికి మొక్కు..
తాజాగా 96 సంవత్సరాలు వయస్సు ఉన్న ఓ వృద్ధురాలిని తన క్యాంప్ ఆఫీస్ కు పిలిచి భోజనం పెట్టారు పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గంలోని కొత్త ఇసుకపల్లికి చెందిన పేరంటాలు( parentalu ) అనే వృద్ధురాలు పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. పిఠాపురంలో పవన్ గెలవాలని పేరంటాలు బలంగా కోరుకుంది. పవన్ గెలిస్తే మొక్కుగా గరగ చేయిస్తానని వేగులమ్మ తల్లిని మొక్కుకుంది. తనకు ప్రతి నెల పింఛనులోంచి వచ్చిన 2500 రూపాయల ను దాచుకుంటూ.. 27 వేల రూపాయలతో గరగ చేయించింది. అయితే తన బిడ్డలాంటి పవన్తో కలిసి భోజనం చేయాలని ఉందని కుటుంబ సభ్యుల వద్ద చెప్పింది. అది జనసేన నేతల వరకు చేరడంతో వారు పవన్ కళ్యాణ్ కు విషయం చెప్పారు. వెంటనే పవన్ కళ్యాణ్ తన క్యాంపు కార్యాలయానికి ఆమెను ఆహ్వానించారు.
* భోజనం పెట్టి..లక్ష రూపాయలు అందించి..
జనసేన క్యాంపు కార్యాలయానికి( janasena camp office ) పేరంటాలు శుక్రవారం వచ్చారు. స్వయంగా ఆహ్వానించిన పవన్ ఆమెను హత్తుకున్నారు. 96 ఏళ్ల వృద్ధురాలికి తనపై ఉన్న అభిమానాన్ని చూసి పవన్ ఫిదా అయ్యారు. ఆమెకు స్వయంగా భోజనం వడ్డించారు. ఆమెకు గౌరవంగా చీరను, లక్ష రూపాయల నగదును బహూకరించారు. పేరంటాలు ఆనందంతో మురిసిపోయారు. నాది చిన్న మొక్కు.. కానీ నాకు అంతటి గౌరవం దక్కడం చాలా ఆనందంగా ఉందన్నారు. దానికి పవన్ సైతం ఫిదా అవుతూ మీ ఆశీర్వాదమే నాకు శక్తి. మీరు నన్ను తల్లిలా చూడండని ప్రేమతో స్పందించారు. దీంతో దటీజ్ పవన్ కళ్యాణ్ అంటూ జనసేన సోషల్ మీడియా దీనిని వైరల్ చేస్తోంది. నెటిజెన్స్ సైతం పవన్ మనస్తత్వానికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
పిఠాపురం నియోజకవర్గం, యు.కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన 96 ఏళ్ల పోతుల పేరంటాలు గారు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో, ఆయన విజయం సాధించాలని వేగులమ్మ తల్లికి పొర్లు దండాలు పెట్టి, అమ్మవారికి గరగ చేయిస్తానని మొక్కుకున్నారు. తన పింఛను సొమ్ము నుంచి… pic.twitter.com/CU1lVWKXfo
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) May 9, 2025