Pawan Kalyan: ఏపీలో పవన్ కీ రోల్

పిఠాపురం నుంచి పోటీ చేశారు పవన్. అక్కడ తప్పకుండా గెలుపొందుతారని అంచనాలు ఉన్నాయి. మెజారిటీయే ఫైనల్ అని.. 50 నుంచి 60 వేల వరకు మెజారిటీ సాధించవచ్చు అని కూటమి పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

Written By: Dharma, Updated On : May 28, 2024 10:35 am

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: ఏపీలో జనసేన గెలిచే నియోజకవర్గాలు ఎన్ని? సగానికి పైగా గెలుస్తుందా? దాదాపు అన్ని స్థానాల్లో గెలుపొందుతుందా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈసారి అసెంబ్లీలో జనసేన ప్రాతినిధ్యం పెరగాలని పవన్ బలంగా ఆకాంక్షించారు. చివరకు 21 స్థానాలను పొత్తులో భాగంగా అంగీకరించారు. బలమైన అభ్యర్థులను బరిలో దించారు. అయితే ఆ 21 అసెంబ్లీ స్థానాల్లో.. ఎన్ని సీట్లు గెలుచుకుంటారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే.. పవన్ కళ్యాణ్ పరపతి అంతలా పెరుగుతుంది. అటు ప్రభుత్వంలో ప్రాధాన్యత దక్కుతుంది.

పిఠాపురం నుంచి పోటీ చేశారు పవన్. అక్కడ తప్పకుండా గెలుపొందుతారని అంచనాలు ఉన్నాయి. మెజారిటీయే ఫైనల్ అని.. 50 నుంచి 60 వేల వరకు మెజారిటీ సాధించవచ్చు అని కూటమి పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.ఇక పవన్ సొంత నియోజకవర్గం భీమవరంలో పులవర్తి ఆంజనేయులు తప్పకుండా విజయం సాధిస్తారనిపార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అవనిగడ్డలో సీనియర్ నేత మండలి బుద్ధ ప్రసాద్, తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి సత్యనారాయణ, అనకాపల్లిలో కొణతాల రామకృష్ణ, పెందుర్తిలో పంచకర్ల రమేష్ బాబు, విశాఖ సౌత్ లో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, తెనాలిలో నాదెండ్ల మనోహర్.. ఇలా అంతా గెలుపు గుర్రాలేనని జన సైనికులు చెబుతున్నారు. ఇప్పుడున్న సమాచారం మేరకు జనసేన 20 స్థానాల్లో గెలిచే ఛాన్స్ కనిపిస్తోంది. ఒక్క నెల్లిమర్లలో మాత్రమే లోకం మాధవి వెనుకబడ్డారని ప్రచారం జరుగుతోంది.

గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. దీంతో గత ఐదు సంవత్సరాలుగా అధికార వైసీపీకి టార్గెట్ అయ్యారు. ఎన్నెన్నో అవమానాలు పడ్డారు. కిందిస్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి వరకు అధికార పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ ను ఒక ఫెయిల్యూర్ నాయకుడిగా చూపించే ప్రయత్నం చేశారు.అందుకే ఈసారి పవన్ కళ్యాణ్ బలంగా ప్రయత్నం చేశారు. బలమైన స్థానాలను మాత్రమే తీసుకున్నారు పొత్తులో భాగంగా. అధికార పార్టీ రెచ్చగొట్టినా, కాపు సామాజిక వర్గం అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. తనకు బలమున్న స్థానాలను మాత్రమే తీసుకున్నారు. వాటిపైనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఇవన్నీ సానుకూల ఫలితాలు ఇచ్చినట్లు అంచనాలు వస్తున్నాయి. ఒకవేళ జనసేన సగానికి పైగా స్థానాలు గెలుచుకున్నా.. ఒకటి రెండు స్థానాలు కోల్పోయి.. మిగిలిన స్థానాల్లో గెలిచినా.. పవన్ కళ్యాణ్ కీ రోల్ ప్లే చేసే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.