Pawan Kalyan: ప్రజలకు సుపరిపాలన అందిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan ) చెప్పుకొచ్చారు. ముఖ్యంగా విలువలతో కూడిన రాజకీయం చేస్తామని తరచూ ఆయన నోటి నుంచి వినిపించేది. కానీ క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు తప్పు చేసేసరికి పవన్ కళ్యాణ్ కు ఏం చేయాలో తెలియడం లేదు. సొంత పార్టీ ఎమ్మెల్యే పై ఇప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం.. సోషల్ మీడియాలో వీడియోలు వస్తుండడం చూసి పవన్ కళ్యాణ్ బాధపడుతున్నారట. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తామన్న క్రమంలో గతంలో వైసిపి నేతల వ్యవహార శైలిని గట్టిగానే ప్రశ్నించేవారు పవన్ కళ్యాణ్. కానీ ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కూడా అదే తరహా ఆరోపణలు రావడానికి తట్టుకోలేకపోతున్నారు. వాటిని ఎలా ఫేస్ చేయాలో కూడా ఆయనకు తెలియడం లేదు. గత కొద్ది రోజులుగా ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. దానిపై వైసీపీ ట్రోల్ చేయడం కూడా ప్రారంభించింది. తమ విషయంలో ప్రశ్నించిన పవన్ ఇప్పుడు చేస్తోంది ఏంటి అని గట్టిగానే నిలదీస్తోంది.
* వైసిపి వ్యతిరేక ప్రచారం..
ఢిల్లీ పర్యటనకు( Delhi tour ) వెళ్లారు పవన్ కళ్యాణ్. వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. మరోవైపు విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్ దుర్మరణం పాలయ్యారు. దేశవ్యాప్తంగా నేతలు సంతాపం తెలిపారు. అందులో భాగంగా ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ సంతాపం వ్యక్తం చేశారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అజిత్ పవర్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు జనసేన ఎమ్మెల్యే పై వచ్చిన ఆరోపణల గురించి ప్రస్తావించారు. కానీ దాని గురించి పవన్ కళ్యాణ్ స్పందించలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దానిపైనే ఇప్పుడు హైలైట్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ పారిపోయారు అంటూ మండిపడుతోంది. అయితే పవన్ కళ్యాణ్ ముఖంలో మాత్రం బాధ కనిపిస్తోంది. జనసైనికులు దానిని తట్టుకోలేకపోతున్నారు కూడా.
* దిద్దుబాటు చర్యలేవి?
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్( arava Sridhar ) వ్యవహారంలో జనసేన నాయకత్వం సరిగ్గా డీల్ చేయలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో తెలుగుదేశం ఎమ్మెల్యేల విషయంలో ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. కోనేటి ఆదిమూలం పై ఆరోపణలు వచ్చిన వెంటనే సస్పెన్షన్ వేటు పడింది. తర్వాత చాలామంది ఎమ్మెల్యేలపై ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో విచారణకు కమిటీలను ఏర్పాటు చేశారు చంద్రబాబు. అయితే జనసేన ఎమ్మెల్యే విషయంలో చాలా రోజులుగా వివాదం నడుస్తూనే ఉంది. దానిని సైలెంట్ చేయడంతో పాటు దిద్దుబాటు చర్యలకు దిగడంలో జనసేన నాయకత్వం ఆశించిన స్థాయిలో పనిచేయలేదు. అయితే విలువలకు పెద్దపీట వేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ వైసీపీ నేతల మాదిరిగానే జనసేన నేతలపై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. అయితే మంచి సుపరిపాలన అందించాలన్న పవన్ కళ్యాణ్ లక్ష్యాన్ని కిందిస్థాయిలో తూట్లు పొడుస్తున్నారు. దానిని ఆయన ఎంత మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే మరోసారి ఇటువంటివి పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.