Pawan Kalyan And Balineni Srinivas Reddy: జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి( Srinivas Reddy ) విషయంలో పవన్ ఒక ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డితో ఉన్న మంచి సంబంధాలను తెంచుకొని మరి జనసేనలో చేరిపోయారు. అయితే బాలినేని కి పవన్ మంత్రి పదవి ఆఫర్ చేశారని… ఎమ్మెల్సీ ని చేసి మంత్రి చేస్తారని కూడా ప్రచారం నడిచింది. కానీ నెలలు గడుస్తున్న అటువంటిదేమీ లేకపోయింది. బాలినేని తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారని కూడా ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో బాలినేని విషయంలో పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
* తండ్రి కొడుకుల ప్రోత్సాహం..
బాలినేని శ్రీనివాస్ రెడ్డిని ఎంతగానో ప్రోత్సహించారు వైయస్ రాజశేఖర్ రెడ్డి( Y S Rajasekhara Reddy ). తన తోడల్లుడు వైవి సుబ్బారెడ్డి కి రాజకీయంగా అంత చరిష్మా లేకపోవడంతో ఆయన బావమరిది అయిన బాలినేనికి రాజశేఖర్ రెడ్డి ఛాన్స్ ఇచ్చారు. ఎక్కడో యువజన కాంగ్రెస్లో ఉన్న బాలినేని కి ఒంగోలు అసెంబ్లీ సీటు 2004లో కట్టబెట్టారు. ఆ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన బాలినేనికి మంత్రి పదవి కూడా ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి. అందుకే రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ఆ కుటుంబం తో ఉన్న అనుబంధంతో జగన్ వెంట అడుగులు వేశారు. అయితే జగన్ పార్టీ తరఫున మూడుసార్లు పోటీ చేసిన బాలినేని ఒకసారి మాత్రమే గెలిచారు. 2014లో ఓడిపోవడంతో జగన్మోహన్ రెడ్డి బాలినేనిని ఎమ్మెల్సీ చేశారు. 2019లో గెలిచేసరికి మంత్రి పదవి ఇచ్చారు. కానీ 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బాలినేని జగన్మోహన్ రెడ్డితో విభేదించి జనసేనలో చేరిపోయారు.
* కూటమి నుంచి దక్కని గౌరవం..
అయితే మానసికంగా బాలినేని జనసేనలో చేరారే తప్ప కూటమి తరుపున ఆయనకు సరైన గౌరవం దక్కడం లేదు. అటు ఒంగోలులో( Ongole ) జనసేన నేతలు సైతం ఆయన చేరికను పెద్దగా అంగీకరించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో బాలినేని తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు ప్రచారం జరిగింది. త్వరలో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వెళ్లిపోతారని కూడా టాక్ నడిచింది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వచ్చే ఏడాది పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కాబోతున్నాయి. ఆ సమయంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డికి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకున్న పవన్.. అప్పటిలోగా కొంతమందికి ఎమ్మెల్సీ తో పాటు రాజ్యసభ పదవులు ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. వీరి ద్వారా పార్టీ బలోపేతానికి ఒక వ్యూహం పన్నినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
* ఆ రెండు జిల్లాలపై ప్రభావం..
బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి.. ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఉమ్మడి జిల్లాతో పాటు నెల్లూరులో కూడా ప్రభావితం చూపించగల నేత బాలినేని. బాలినేనికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఆయన జనసేన తరఫున మరింత వాయిస్ వినిపించేందుకు అవకాశం ఉంటుంది. పైగా బాలినేని తో పనిచేసిన నేతలు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. వారంతా బాలినేనికి టచ్ లోకి వస్తారని.. అలా జగన్ మోహన్ రెడ్డిని బలహీన అలా జగన్ మోహన్ రెడ్డిని బలహీన పరచవచ్చన్నది పవన్ ఆలోచన. మరి ఆయన ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.