Deputy Cm Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) నేడు తన కుటుంబంతో కలిసి కుంభమేళా(Prayagraj Mahakumbh) లో స్నానం ఆచరించాడు. ఆయనతో పాటు కొడుకు అకిరా నందన్(Akira Nandan), భార్య అన్నా లెజినోవా తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Director Trivikram Srinivas) కూడా పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. క్రిస్టియన్ మతానికి చెందిన ఆమె అయినప్పటికీ అన్నా లెజినోవా మన హిందూ సంప్రదాయానికి గౌరవం ఇస్తూ కుంభమేళాలో స్నానం ఆచరించడం పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తుంది. కోట్ల మంది మనోభావాలకు ముడిపడి ఉన్న సనాతన ధర్మం పై రాజకీయ నాయకులు బాధ్యతారాహిత్యంగా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్న ఈ నేపథ్యంలో పర మతానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ ఇంతలా మన హిందూ సంప్రదాయాలను గౌరవించడం నిజంగా అభినందించదగ్గ విషయం అంటూ ప్రశంసిస్తున్నారు.
2024 సార్వత్రిక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పేరు జాతీయ స్థాయిలో మారుమోగింది. అప్పటి నుండి ఆయన ఏది చేసిన నేషనల్ వైడ్ గా వార్త అయ్యేది. హిందువులు మొత్తం పవన్ కళ్యాణ్ కుంభమేళా రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నేడు ఆయన రావడంతో వాళ్లంతా సంబరాలు చేసుకుంటున్నారు. అంతే కాకుండా అక్కడ మీడియా తో కూడా ఆయన కాసేపు ముచ్చటించాడు. మమతా బెనర్జీ సనాతన ధర్మం మీద చేసిన కామెంట్స్ పై అక్కడి మీడియా ఆయన దృష్టికి తీసుకొని వెళ్లగా, దానికి ఆయన సమాధానం చెప్తూ ‘ ఈ దేశం లో సనాతన ధర్మం పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం సరదా అయిపోయింది. అదే వేరే మతం మీద ఇలా మాట్లాడే సాహసం చేయలేరు. ఇలా ఇష్టమొచ్చినట్టు మాట్లాడేవాళ్ళకు, అది కోట్లాదిమంది నమ్మకాలకు సంబంధించిన వ్యవహారమని ఎందుకు గుర్తించరో నాకు అర్థం కావడం లేదు’ అంటూ ఆయన వ్యాఖ్యానించాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు ఇప్పుడు నేషనల్ లెవెల్ లో ట్రెండ్ అవుతున్నాయి.
ఒక పక్క ఉపముఖ్యమంత్రిగా పాలనలో తనదైన మార్కు చూపిస్తూనే, మరోపక్క తాను చేస్తున్న సినిమాల పై కూడా ఫోకస్ పెడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఆయన నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం వచ్చే నెల 28వ తారీఖున విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. 90 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం పూర్తి అవ్వడానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే బ్యాలన్స్ ఉంది. పవన్ కళ్యాణ్, సత్యరాజ్ మధ్య ఒక కీలక సన్నివేశాన్ని చిత్రీకరించాల్సి ఉంది. ఈ నెలాఖరు లోపు షూటింగ్ ని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. మరోపక్క పాన్ ఇండియా లెవెల్ లో విపరీతమైన క్రేజ్ ని తెచ్చుకున్న ‘ఓజీ’ చిత్రం షూటింగ్ ని కూడా త్వరలోనే పూర్తి చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్. ఈ ఏడాది లోనే ఈ రెండు సినిమాలు విడుదల కానున్నాయి.
Pawan Kalyan ji took a sacred dip at Prayagraj Kumbh along with his family. pic.twitter.com/kUzvZtMD5I
— Anshul Pandey (@Anshulspiritual) February 18, 2025