Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan : రేవంత్ రెడ్డికి.. పవన్ కళ్యాణ్ 5 పేజీల లేఖ.. అందులో ఏముంది.....

Pawan Kalyan : రేవంత్ రెడ్డికి.. పవన్ కళ్యాణ్ 5 పేజీల లేఖ.. అందులో ఏముంది.. ఇప్పుడే రాయాల్సిన అవసరం ఏమొచ్చింది..

Pawan Kalyan : భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత జనసేన పార్టీ అధినేత.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముంబై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత ఆయన విశ్రాంతి తీసుకోకుండా.. పాలనపరమైన వ్యవహారాలు.. ఇతర అంశాల మీద దృష్టి సారించడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఏపీ మీద కాకుండా.. తెలంగాణ మీద ఆయన ఫోకస్ పెట్టారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 5 పేజీల లేఖ రాశారు. వాస్తవానికి ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకిలా లేఖ రాశారు. అందులోనూ ఐదు పేజీల లేఖ ఎందుకు రాశారు.. అనే అంశాలు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశాలుగా మారాయి.

పవన్ కళ్యాణ్ రాసిన ఆ ఐదు పేజీల లేఖలలో కీలకమైన అంశాలు ఉన్నాయి. ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తిపై 2023లో హైదరాబాదులోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు అయింది. ఆయన ఇప్పటికీ ఆ వ్యక్తి ఆధ్యాత్మిక విధులలో కొనసాగుతున్నారు. దీనిపై ఆయన మతానికి సంబంధించిన పెద్దల నుంచి పవన్ కళ్యాణ్ కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ పోలీసులు కూడా ఈ విషయం మీద సీరియస్ గా దృష్టి సారించాలని.. ఆ పవిత్రమైన మతాలయం గౌరవాన్ని కాపాడాలని పవన్ కళ్యాణ్ అందులో కోరారు. ఇక ఇటీవల షాబాద్ మండలంలో జరిగిన వ్యవహారం గురించి కూడా పవన్ కళ్యాణ్ ఆ లేఖలో ప్రస్తావించారు.

కేసులకు సంబంధించి.. దర్యాప్తు విషయంలో పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డికి అనేక రకాలుగా సూచనలు చేశారు. సాధారణ కేసుల సంబంధించి 60 రోజులు.. సంక్లిష్టమైన కేసులకు సంబంధించి 90 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేసే విధంగా కాల పరిమితి అమలు చేయాలని పవన్ కళ్యాణ్ అందులో కోరారు. ఈ వ్యవహారాల మీద ప్రతినెల ఎస్పీ.. ఐజి స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించాలని సూచించారు. దారుణమైన వ్యవహారాలకు పాల్పడిన వ్యక్తులకు బెయిల్ మంజూరు చేయకుండా కట్టడి విధించాలని.. అవసరమైతే అధికారులు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చే విధంగా చూడాలని.. బాధితులను బెదిరించే వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని.. అవసరమైతే రౌడీషీట్ కూడా ఓపెన్ చేయాలని పవన్ కళ్యాణ్ ఆ లేఖలో రేవంత్ రెడ్డికి సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో హోం శాఖ మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి కొనసాగుతున్న నేపథ్యంలో.. నేరుగా ఆయనకే పవన్ కళ్యాణ్ లేఖ రాయడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular