Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Balineni Srinivasa Reddy: బాలినేని కోసం రంగంలోకి పవన్!

Pawan Kalyan Balineni Srinivasa Reddy: బాలినేని కోసం రంగంలోకి పవన్!

Pawan Kalyan Balineni Srinivasa Reddy: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా కొత్తవారి చేరికలతో పార్టీని మరింత బలోపేతం చేయాలని చూస్తున్నారు. అయితే ఈ చేరికల విషయంలో జనసేన నేతలు అనుసరిస్తున్న వైఖరిపై పవన్ ఆగ్రహంగా ఉన్నారు. పార్టీని అభివృద్ధి చేయాలంటే చేరికలను ప్రోత్సహించాల్సిందేనని తేల్చి చెప్పారు. అయితే ఇటీవల కొన్ని జిల్లాల్లో పార్టీ క్రమశిక్షణ కట్టు దాటుతోంది. దీంతో పవన్ కళ్యాణ్ నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు ఆ జిల్లాలపై. అందులో భాగంగా ప్రకాశం జిల్లా పార్టీ కార్యవర్గాన్ని రద్దు చేశారు. అక్కడ పార్టీ నేతలు అనుసరిస్తున్న తీరును తప్పు పట్టారు. ఒక నేతపై సస్పెన్షన్ వేటు కూడా వేశారు. పార్టీలో ఉంటే ఉండండి లేకపోతే వెళ్లిపోండి అంటూ తేల్చి చెప్పడం విశేషం. ఇటీవల జరిగిన పరిణామాలతోనే పవన్ సీరియస్ గా స్పందించినట్లు తెలుస్తోంది.

బాలినేని రాక పై వ్యతిరేకత..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్ కూడా. కానీ ఆయన రాకను ప్రకాశం జిల్లా నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చివరకు అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన వారి వైఖరి మారడం లేదు. దీంతో అధినేత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. క్రమంలోనే నిన్న జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రకాశం జిల్లా నేతలను ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. అయితే ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రియాజ్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఆయన మాజీ మంత్రి బాలినేని రాకను వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల బాలినేనికి జనసేన డీలిమిటేషన్ కమిటీ లో చోటు ఇచ్చారు. అధినేత ఆదేశాల మేరకు రాయలసీమతో పాటు ఒంగోలు, నెల్లూరు జిల్లా నేతలతో సమావేశం అయ్యారు బాలినేని. అక్కడ ఓ నేత బాహాటంగానే విమర్శలు చేశారు బాలినేని పై. దీనిపై తాజాగా స్పందించిన పవన్ సదరు నేతపై వేటు వేశారు. అంతటితో ఆగకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన కార్యవర్గాన్ని రద్దు చేశారు. నియోజకవర్గ ఇన్చార్జి లతోపాటు వివిధ విభాగాల ప్రతినిధులను సైతం పదవుల నుంచి తొలగించారు. కొత్త కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా మాజీ మంత్రి బాలినేనికి కీలక బాధ్యతలు కట్టబెట్టనున్నట్లు సంకేతాలు పంపారు.

కమిటీలన్నీ రద్దు..
ఇటీవల బాలినేని విషయంలో వైఖరి మారుతోంది పవన్ కళ్యాణ్ కు. మొన్ననే ఆయన సీఎం చంద్రబాబును సైతం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బాలినేని రాకను టిడిపి ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో జనసేన క్యాడర్ సైతం వ్యతిరేకిస్తోంది. ఒంగోలు కార్పొరేషన్ నుంచి 26 మంది కార్పొరేటర్ లను జనసేనలో చేర్పించారు బాలినేని. అయినా సరే జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రియాజ్ సరైన గుర్తింపు ఇవ్వడం లేదు. వాస్తవానికి బాలినేని వైసీపీ నుంచి రావడంతో ఆయనపై అనుమానపు చూపులు ఉండేవి. పని జిల్లా జనసేన నేతలు వైఖరి చూస్తుంటే వారి వెనుక వైసిపి ఉన్నట్టు అర్థం అవుతుంది. కేవలం బాలినేని అడ్డుకోవాలని రీతిలో వైసిపి నాయకత్వం స్థానిక జనసేన నేతలతో ఇలా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వరకు వెళ్లడంతో ఆయన కమిటీలన్నింటినీ రద్దు చేశారు. ఇకనుంచి బాలినేనికి జిల్లా బాధ్యతలు కట్టబెట్టే అవకాశం ఉంది. టిడిపి పరంగా కూడా బాలినేనిపై ఇకనుంచి అభ్యంతరాలు రాకపోవచ్చు. ఎందుకంటే బాలినేని ఒంగోలు విడిచి దర్శి వైపు అడుగులు వేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. మొత్తానికైతే పరిస్థితులు చూస్తుంటే మాజీ మంత్రి బాలినేనికి అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version