Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan : మోడీ ఆదేశాలతో చెన్నైలో అడుగుపెట్టిన పవన్.. ఏం జరుగుతుందో?

Pawan Kalyan : మోడీ ఆదేశాలతో చెన్నైలో అడుగుపెట్టిన పవన్.. ఏం జరుగుతుందో?

Pawan Kalyan : ఏపీ ( Andhra Pradesh) రాజకీయాల్లో నిత్యం పవన్ కళ్యాణ్ చర్చకు వస్తుంటారు. సమకాలీన అంశాలపై ఆయన నిత్యం మాట్లాడుతుంటారు. ఈ క్రమంలో ఆయన చేసిన ప్రకటనలు ప్రకంపనలు రేపుతుంటాయి. అయితే ఒక రాజకీయ పార్టీ నేతగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా పవన్ చర్యలను ప్రతి ఒక్కరూ గమనిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ కు ఏపీతోపాటు తెలంగాణలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. పవన్ రాజకీయ ప్రకటనలను నిత్యం గమనిస్తుంటారు తమిళనాడు బీజేపీ నేతలు. కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు.. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న మొదలు.. ఆయనను తమిళ నేతలు టార్గెట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అభినందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సనాతన ధర్మం పేరిట ఆయన చేసిన పోరాటాన్ని వ్యతిరేకించింది తమిళ నేతలే. ఈ క్రమంలో పవన్ సైతం తమిళనాడు విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. అక్కడ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. దీని వెనుక బిజెపి అజెండా ఉందన్నది ఒక అనుమానం.

* జమిలిపై సదస్సు
ఈరోజు చెన్నైలో( Chennai) ఓ కీలక సమావేశం జరగనుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. అందులో భాగంగా ఈరోజు చెన్నైలోని ఓ కన్వెన్షన్ హాల్లో భారీ సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. తమిళనాడు బీజేపీ శాఖ దీనిని నిర్వహిస్తోంది. అయితే ఇప్పుడు పవన్ బిజెపి నిర్వహించిన కార్యక్రమానికి హాజరవుతుండడంతో.. ఆయన ఎటువంటి ప్రకటనలు చేస్తారో అని అంతా ఎదురుచూస్తున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా చెన్నై చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయనకు ఎయిర్ పోర్టులో బిజెపి నేతలు స్వాగతం పలికారు.

Also Read : ఏపీకి కుంకీ ఏనుగులు.. రెండు దశాబ్దాల సమస్యకు పరిష్కారం!

* సనాతన ధర్మంపై ప్రకటనలు..
గతంలో తమిళనాడు( Tamil Nadu ) వేదికగా సంచలన ప్రకటనలు చేశారు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మ పరిరక్షణ కోసం బలమైన వ్యవస్థ రావాలని ఆకాంక్షించారు. తిరుమల లడ్డు వివాద సమయంలో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో తమిళనాడు నేతల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. నటుడు ప్రకాష్ రాజ్ తో పాటు అక్కడి డిప్యూటీ సీఎం సైతం పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు. దానికి పవన్ కళ్యాణ్ సైతం కౌంటర్ ఇచ్చారు. తమిళనాడులో బిజెపి ఉనికి చాటుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటివరకు కొలిక్కి రావడం లేదు. అక్కడ పవన్ కళ్యాణ్ ద్వారా ప్రభావం చూపాలని బిజెపి భావిస్తోంది. అందుకే పవన్ ద్వారా హిందూ సమాజాన్ని తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది. అందుకే ఏ కార్యక్రమానికైనా పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా ఆహ్వానిస్తోంది.

* విభిన్న రాజకీయ పరిస్థితులు..
తమిళనాడులో ఇప్పటికే అధికార డిఎంకె ( DMK)/దూకుడుగా ఉంది. ఆ పార్టీ కాంగ్రెస్తో స్నేహాన్ని కొనసాగిస్తోంది. అన్న డీఎంకేతో బిజెపి పొత్తు కొనసాగింది. మరోవైపు సినీ నటుడు విజయ్ పార్టీ ఒకటి ఎంట్రీ ఇచ్చింది. ఈ బహుముఖ పోటీలో బిజెపికి ఇబ్బందికర పరిస్థితులు తప్పేలా లేవు. అందుకే పవన్ సేవలను తమిళనాడులో ఉపయోగించుకోవాలని బిజెపి భావించింది. అందుకే ఈ కీలక సదస్సుకు పవన్ కళ్యాణ్ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించింది. మరి పవన్ ఎలాంటి సంచలన ప్రకటనలు చేస్తారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular