Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత రెండు రోజుల నుండిఒ ‘వారాహి యాత్ర’ ని విజయవంతంగా కొనసాగిస్తూ ముందు దూసుకెళ్తున్నాడు. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గురించి చర్చ. కేవలం రెండు మీటింగ్స్ తోనే అధికార పార్టీ గుండెల్లో గుబులు పుట్టించాడు పవన్ కళ్యాణ్. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది, ఎందుకంటే గడిచిన కొద్దీ నెలలు గా జనసేన పార్టీ గ్రాఫ్ బాగా తగ్గింది.
అభిమానులు ఒక పెద్ద మూమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, అలాంటి సమయం లో వచ్చిన ఈ వారాహి యాత్ర కి జనసేన పార్టీ కార్యకర్తలతో పాటుగా, పవన్ కళ్యాణ్ అభిమాని కానీ వాళ్ళు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. లోకేష్ వంద రోజులకు పైగా చేసిన పాదయాత్ర వల్ల కూడా రాని బలమైన ఇంప్యాక్ట్ పవన్ కళ్యాణ్ ‘వారాహి యాత్ర’ కేవలం రెండు రోజుల్లోనే తెచ్చుకుంది.
ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ నేడు కాకినాడ లో జనవాణి కార్యక్రమం నిర్వహించాడు. ఈ కార్యక్రమం లో పవన్ కళ్యాణ్ వివిధ సమస్యల పట్ల అక్కడికి వచ్చిన సామాన్యుల నుండి వినతి పత్రాలు సేకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాడు. ఇక జనసేన పార్టీ లో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు వివిధ ప్రమాదాల కారణం గా చనిపోతే వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్ధిక సహాయం చేసాడు. అంతే కాదు భవిష్యత్తులో ఆ కుటుంబాలకు ఎలాంటి సహాయసహకారాలు కావాలన్నా జనసేన పార్టీ అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ భరోసా నింపాడు.
ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రసంగం లో తనకి ఇప్పటి వరకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదనే విషయాన్నీ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన గురించి పెద్దగా ఎప్పుడు ఆలోచించలేదని, కేవలం ఎదుటివాడి సమస్య గురించే ఆలోచించేవాడినని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలిపాడు. సమస్న్యా మధ్య తరగతి కుటుంబాలు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటున్న ఈరోజుల్లో పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ చేయించుకోలేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.