Homeఆంధ్రప్రదేశ్‌Deputy CM Pawan Kalyan : తీవ్ర అనారోగ్యంతో పవన్.. ఏంటీ స్పాండిలైటిస్.. జనసైనికుల్లో ఆందోళన!

Deputy CM Pawan Kalyan : తీవ్ర అనారోగ్యంతో పవన్.. ఏంటీ స్పాండిలైటిస్.. జనసైనికుల్లో ఆందోళన!

Deputy CM Pawan Kalyan :  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan) తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఆయన కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. మధ్య మధ్యలో సినిమా షూటింగ్లకు సైతం హాజరవుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటనలు మాత్రం రావడం లేదు. ఆయన రాజకీయాల్లో కనిపించకపోయేసరికి ఎన్నో రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో ఆయన అనారోగ్యంపై కూడా రకరకాల చర్చ నడుస్తోంది. గత నాలుగు రోజులుగా ఆయన పెద్దగా కనిపించలేదు. సింగపూర్ వెళ్లినట్లు ప్రచారం నడుస్తోంది. అదే సమయంలో వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు ఆయన కార్యాలయం నుంచి ఒక ప్రకటన వచ్చింది. జ్వరంతో పాటు స్పాండిలైటిస్ తో బాధపడుతున్నట్లు ఆ ప్రకటనలో ఉంది. అయితే పవన్ కళ్యాణ్ అంతలా బాధ పెడుతున్న ఆ స్పాండిలైటిస్ అంటే ఏమిటి? అని జన సైనికులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈరోజు జరిగే క్యాబినెట్ బేటీకి సైతం ఆయన హాజరయ్యే ఛాన్స్ లేదని సమాచారం.

* క్షణం తీరిక లేకుండా
గత సంక్రాంతికి ముందు నుంచి ఆయన సినిమా షూటింగ్లను( cinema shootings ) నిలిపివేశారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేశారు. కూటమి పార్టీల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సొంత నియోజకవర్గ పిఠాపురంలో సైతం నిత్య పర్యటనలు సాగించారు. ఎన్నికలకు ముందు క్షణం తీరిక లేకుండా గడిపారు పవన్ కళ్యాణ్. ఆ సమయంలోనే ఆయన తరచూ అనారోగ్యానికి గురయ్యేవారు. ప్రధానంగా వెన్ను నొప్పితో అసౌకర్యానికి గురయ్యేవారు. ఆయనకు మెడ నుంచి వెన్నుముక వరకు తీవ్రమైన నొప్పి వస్తుండేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అదే వెన్ను నొప్పితో బాధపడుతూ విశ్రాంతి తీసుకుంటున్నారని జనసేన వర్గాలు చెప్పుకొస్తున్నాయి.

* లక్షణాలు ఇవే
అయితే స్పాండిలైటిస్( Spondylitis) తో ఇబ్బందులు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. విపరీతమైన మెడ నొప్పితో తల తిరగడం, కళ్ళు తిరిగి పడిపోవడం, నడుస్తున్న సమయంలో ముందుకు దూలిపోతున్నట్టు అనిపించడం వంటివి జరుగుతాయని చెబుతున్నారు. వీటితో పాటు వాంతులు, వికారం వంటివి ఉంటాయని.. చేతులు, కాళ్లు తిమ్మిర్లుగా అనిపిస్తాయని అంటున్నారు. అయితే నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్ వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ప్రకటన రావడంతో జనసైనికులు ఒక రకమైన ఆందోళన వ్యక్తం అవుతోంది.

* గతంలో చాలాసార్లు
గతంలో చాలాసార్లు పవన్ కళ్యాణ్( Pawan Kalyan) ఇదే మాదిరిగా అనారోగ్యం బారిన పడ్డారు. తరువాత కోలుకొన్నారు. అయితే ఈసారి గత నాలుగు రోజులుగా ఆయన కనిపించడం లేదు. అదే సమయంలో కార్యాలయం ప్రత్యేక ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఎక్కువమంది జనసైనికులు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పై ఆరా తీస్తున్నారు. అయితే ఆయన హెల్త్ విషయంలో ప్రత్యేక ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version