Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Convoy: పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కి స్వల్ప ప్రమాదం..ఆందోళనలో అభిమానులు!

Pawan Kalyan Convoy: పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కి స్వల్ప ప్రమాదం..ఆందోళనలో అభిమానులు!

Pawan Kalyan Convoy: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కాన్వాయ్ స్వల్ప ప్రమాదానికి గురైన వార్త ఇప్పుడు అభిమానులను కంగారుకి గురి చేస్తోంది. వైజాగ్ లోని ర్యాడిసన్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ని పికప్ చేసుకోవడానికి ఆయన కాన్వాయ్ బయలుదేరింది. అయితే కాన్వాయ్ లోని ఒక కారు సడన్ బ్రేక్ వేయడం వల్ల చివర్లో ఉన్న కారు ద్వంసం అయ్యింది. అయితే కారులో ఉన్న వాళ్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే సోషల్ మీడియా లో ఈ ప్రమాదం పై విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్ కి ఇలాంటి పరిస్థితి ఏర్పడితే ఎలా?, కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కదా, ఎవరికీ ఎలాంటి గాయాలు అవ్వలేదు కాదు సరిపోయింది, ఒకవేళ అయ్యుంటే పవన్ కళ్యాణ్ కి ఎంత చెడ్డ పేరు వచ్చి ఉండేది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ -2026 కార్యక్రమం లో పాల్గొనేందుకు నిన్న విశాఖ కు విచ్చేశాడు పవన్ కళ్యాణ్. దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేయగా, ఆమెని ఆహ్వానించేందుకు వైజాగ్ విమానాశ్రయం కి గవర్నర్ అబ్దుల్ నజీర్ తో కలియు వెళ్ళాడు పవన్ కళ్యాణ్. రాత్రి సమయం లో నేవీ అధికారులు ఇచ్చిన విందు లో గవర్నర్ నజీర్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో కలిసి పాల్గొన్న పవన్ కళ్యాణ్, ఆ తర్వాత వైజాగ్ లోని ర్యాడిసన్ హోటల్ కి తన సతీమణి అన్నా లెజినోవా తో కలిసి వెళ్ళాడు. నేడు వైజాగ్ లో పర్యటన ఉన్న నేపథ్యం లో ఆయన కాన్వాయ్ ర్యాడిసన్ హోటల్ కి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడం తో అభిమానులు సంతోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular