Pastor Praveen : పాస్టర్ ప్రవీణ్ పగడాల( pastor praveen pagadala ) అనుమానాస్పద కేసుకు సంబంధించి ఒక్కోనిజం బయటపడుతోంది. కొద్ది రోజుల కిందట రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయనది హత్య అని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తుండగా.. రోడ్డు ప్రమాదమని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయినా సరే రగడ జరుగుతోంది. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో 24న విజయవాడ నుంచి రాజమండ్రిలో ప్రవీణ్ పగడాల చర్యలపై అణువణువు విచారణ చేపట్టారు. అక్కడ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ట్రాఫిక్ పోలీసులతో పాటు టీ కొట్టు మాస్టర్ సైతం ప్రవీణ్ పగడాలతో మాట్లాడామని వివరించారు.
Also Read : పాస్టర్ ప్రవీణ్.. విజయవాడలో అంత సేపు ఏం చేశారు?
* ట్రాఫిక్ ఎస్ఐ సఫర్యలు
ప్రధానంగా విజయవాడలోని( Vijayawada city) ఓ చౌరస్తాలో సెల్ఫ్ ఆక్సిడెంట్ లో కిందకు పడిపోయారు ప్రవీణ్ పగడాల. దీనిపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు ఘటనా స్థలానికి వెళ్లారు. అప్పటికే ప్రవీణ్ పగడాల కిందకు పడిపోయారు. బండికి డ్యామేజ్ జరిగింది. హెడ్ లైట్ ఊడిపోయింది. కిందకు వేలాడుతూ కనిపించింది. అయితే దెబ్బలు ఏమైనా తగిలాయి అంటూ ట్రాఫిక్ ఎస్ఐ అడిగేసరికి ఏమీ లేదని సమాధానం చెప్పారు ప్రవీణ్ పగడాల. అయితే ఆయనకు సఫర్యలు చేసి సమీపంలోని ఓ పార్కులో విడిచిపెట్టారు ట్రాఫిక్ ఎస్సై. అక్కడే మూడు గంటలపాటు ఉండిపోయారు ప్రవీణ్ పగడాల. చాలా నీరసంతో కనిపించడంతో అక్కడున్నవారు ఈరోజు ఇక్కడే హోటల్లో విశ్రాంతి తీసుకోండి అంటూ సలహా ఇచ్చారు. కానీ ప్రవీణ్ వినలేదని తెలుస్తోంది.
* గుర్తించిన టీ కొట్టు మాస్టర్..
మరోవైపు టీ కొట్టు మాస్టర్ నాగార్జున సైతం తాను పాస్టర్ ప్రవీణ్ పగడాలను చూశానని.. మాట్లాడాలని కూడా చెబుతున్నారు. ప్రమాదం జరిగిన మూడు గంటల తరువాత ప్రవీణ్ పరిస్థితి ఎలా ఉందని తెలుసుకునేందుకు ఎస్సై సుబ్బారావు( traffic si Subbarao ) పార్కు వద్దకు వెళ్లారు. ప్రవీణ్ కు టీ కొట్టు వద్దకు తీసుకువెళ్లి టీ కూడా ఇప్పించారు. అయితే ద్విచక్ర వాహనం హెడ్లైట్ పగిలి ఉండడాన్ని గుర్తించారు టీ మాస్టర్ నాగార్జున. అయితే ఆరోజు టీ తాగేటప్పుడు ఆయనను గమనించానని.. ప్రమాదం జరిగిన తర్వాత టీవీలో చూసేసరికి తనకు గుర్తు వచ్చిందని.. కనీసం హెడ్లైట్ను తాడుతో కట్టేందుకు ప్రయత్నిస్తుండగా ప్రవీణ్ పగడాల వెళ్లిపోయారంటూ చెబుతున్నాడు నాగార్జున. మరోవైపు ట్రాఫిక్ ఎస్సై సుబ్బారావు సైతం ఆ హెడ్లైట్ కట్టేందుకు ట్రాఫిక్ బూత్ లోకి వెళ్లి వెతుకుతుండగా అక్కడ నుంచి వెళ్లిపోయారట ప్రవీణ్ పగడాల.
* బండి నడపలేని స్థితిలో..
మరోవైపు గొల్లపూడి పెట్రోల్ బంకు ( Gollapudi petrol bunk) వద్దకు పెట్రోల్ కొట్టించేందుకు ద్విచక్ర వాహనంతో చేరుకున్నారు ప్రవీణ్ పగడాల. అప్పటికే బండి నడపలేని స్థితిలో ఉన్నారట. పెట్రోల్ ఎంత వేయాలి అంటే సైగ చేస్తూ ఎనిమిది చూపించారని.. 800 రూపాయలకు పైగా పెట్రోల్ పోస్తే ఫోన్ పే చేశారని అక్కడ సిబ్బంది చెబుతున్నారు. మొత్తానికైతే సెల్ఫ్ యాక్సిడెంట్ తర్వాత నీరసంగా కనిపించిన ఆయన తూలుతూనే బండి డ్రైవింగ్ చేసినట్లు తేలింది. అయితే విజయవాడ నుంచి అంత నీరసంగా వచ్చిన ప్రవీణ్ పగడాల.. దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తరువాత ప్రమాదానికి గురై ఉంటారన్నది ఒక అనుమానం. అయితే ప్రవీణ్ పగడాల గత అనుభవాల దృష్ట్యా ఆయనను హత్య చేసినట్లు క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
Also Read : పాస్టర్ ప్రవీణ్ కుమార్ కేసులో.. కీలకంగా మారినవివే!