Pastor Praveen Case: తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ ప్రవీణ్ పగడాల( paster Pravin pagadala ) మృతి సంచలనం రేకెత్తిన సంగతి తెలిసిందే. ఇది ప్రమాదమని పోలీసులు చెప్పగా.. కాదు కాదు హత్య అని క్రైస్తవ సంఘాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం నడిచింది. కొద్ది రోజులపాటు ఇదే అంశం హల్చల్ చేసింది. ఈ తరుణంలో సీఎం చంద్రబాబుతో పాటు హోం మంత్రి వంగలపూడి అనిత కూడా స్పందించారు. పోలీసు విచారణకు ఆదేశించారు. గత కొద్దిరోజులుగా ప్రత్యేక పోలీస్ బృందాలు విచారణ చేపట్టాయి. పాస్టర్ ప్రవీణ్ హైదరాబాదులో బయలుదేరింది మొదలు.. ప్రమాదం జరిగిన వరకు ఏం జరిగింది అనే దానిపై క్షుణ్ణంగా విచారణ చేపట్టాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చారు. కేసును ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేశారు. చివరకు ప్రమాదమేనని తేల్చేశారు. ఈ కేసు వివరాలను రాజమండ్రిలో ఐజి అశోక్ కుమార్ వెల్లడించారు. ఎక్కడ ఏమేం జరిగింది.. విచారణ ఎలా చేపట్టింది వివరించారు డిఐజి.
Also Read: రాజకీయాల్లోకి విజయసాయిరెడ్డి.. ఢిల్లీ నుంచి సంకేతాలు!
* రకరకాలుగా ప్రచారం..
హైదరాబాదు( Hyderabad) నుంచి రాజమండ్రి వచ్చేందుకు ద్విచక్ర వాహనంపై పాస్టర్ ప్రవీణ్ పగడాల బయలుదేరారు. ఈ క్రమంలోనే రాజమండ్రి సమీపంలోని జాతీయ రహదారి వద్ద అనుమానాస్పదంగా మృతి చెంది కనిపించారు. అయితే ఆయన ను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తూ వచ్చాయి. అయితే పోలీస్ విచారణలు అది సెల్ఫ్ యాక్సిడెంట్ అని తేలడం విశేషం. హైదరాబాదు నుండి బయలుదేరిన ప్రవీణ్ కీసర టోల్ ప్లాజా వద్ద అదుపుతప్పి కిందకు పడిపోయారు. అయితే ఆయన మద్యం మత్తులో ఉన్నట్టు మృతదేహం పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ఆయన శరీరంలో మద్యం ఆనవాళ్లు కనిపించాయని ఐజి తెలిపారు. హైదరాబాదు నుంచి రాజమండ్రి సమీపంలో ప్రమాదం జరిగే వరకు ఆయన మూడు చోట్ల మద్యం తాగారు. దారిలో చిన్న చిన్న ప్రమాదాలు మూడు జరిగాయి. చివరిగా కొంతమూరు పై వంతెనకు వచ్చేసరికి.. ఆయన బుల్లెట్ వాహనం రోడ్డు పక్కకు దూసుకుపోయింది. అయితే ఆ సమయంలో రోడ్డు విస్తరణకు సంబంధించిన పనులు జరుగుతుండడంతో భారీ రాళ్లపై పడి.. ప్రవీణ్ ప్రాణాలు వదిలినట్లు పోలీసు విచారణలో తేలింది.
* సెల్ఫ్ యాక్సిడెంట్..
అయితే ప్రవీణ్ వాహనానికి ఏ వాహనం కూడా ఢీకొట్టలేదు. ఇది సెల్ఫ్ యాక్సిడెంట్( self accident) మాత్రమేనని ఫోరేనిక్స్ నివేదిక సైతం స్పష్టం చేసింది. ప్రమాదం జరిగినప్పుడు ద్విచక్ర వాహనం ఫోర్త్ గేర్ లో ఉంది. అయితే కీసర టోల్ ప్లాజా వద్ద ప్రమాదానికి గురయ్యారు ప్రవీణ్. అక్కడ సహాయక చర్యలు చేపడతామని అంబులెన్స్ సిబ్బంది వచ్చారు. అయితే అక్కడ నుంచి బయలుదేరిన ప్రవీణ్ రామవరప్పాడు జంక్షన్ వద్ద మరింత అలసటగా కనిపించారు. అక్కడ ట్రాఫిక్ ఎక్సైజ్ సూచనతో పార్కులో రెండు గంటల పాటు నిద్రపోయారు. కండిషన్ బాగాలేదని,.. వెళ్లవద్దని చెప్పినా ఆయన వినలేదు. హెడ్లైట్ పగిలిపోవడంతో రైట్ సైడ్ బ్లింకర్ వేసుకునే ప్రయాణించారు. ఏలూరు మద్యం దుకాణం లో సరుకు కొనుగోలు చేశారు. అప్పటికే ఆయన కళ్ళజోడు పగిలిపోయి ఉంది. సరిగ్గా కొంతమూరు పై వంతెనకు వచ్చేసరికి వాహనం వేగం పెరిగి పక్కకు దూసుకుపోయింది. పక్కనే ఉన్న రాళ్లపై ప్రవీణ్ పడడం.. ఆయనపై బుల్లెట్టు పడిపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అదే విషయాన్ని ఐ జి వెల్లడించారు.
* గత కొద్దిరోజులుగా విచారణ..
గత కొద్దిరోజులుగా ఈ కేసు విషయంలో విచారణ కొనసాగుతూ వచ్చింది. అయితే సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ధ్రువీకరించేందుకు ఎవరు ముందుకు రాలేదు. అదే సమయంలో పోలీసులు ప్రత్యక్ష సాక్షులను, సీసీ పూటేజీలను పరిశీలించారు. ఇది ప్రమాద భరితంగానే జరిగిందని ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఇప్పటికే ఈ ఘటనపై క్రైస్తవ సంఘాలు రకరకాల ఆరోపణలు చేస్తూ వచ్చాయి. ఇప్పుడు ఎలా స్పందిస్తాయో చూడాలి.