Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan) జాతీయస్థాయిలో సైతం తన ముద్రను చాటుకుంటున్నారు. జాతీయస్థాయి రాజకీయాలను శాసిస్తున్న ఆయన ఇప్పుడు ఏపీలో నిర్వర్తిస్తున్న శాఖలను సైతం ముందంజలో తీసుకెళ్తున్నారు. ఏపీలో ఆయన నిర్వహిస్తున్న పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయస్థాయిలో నంబర్ వన్ గా నిలిచింది. గతంలో జాతీయస్థాయిలో 23వ స్థానంలో ఉన్న ఏపీ 22 స్థానాలను మెరుగుపరుచుకొని ఒకటో స్థానంలో నిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నేషనల్ మీడియాలో సైతం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.
* రాజకీయంగా మార్క్..
రాజకీయంగాను తనదైన మార్క్ చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఏపీలో కూటమి కట్టడంలో ఆయనదే కీలక పాత్ర. అప్పటివరకు బిజెపితో( Bhartiya Janata Party) పాటు టిడిపి మధ్య గ్యాప్ ఉండేది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దూరం చేయాలంటే మూడు పార్టీల కలయికను ముందే గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేస్తే సంఘీభావం తెలిపి నేరుగా టిడిపితో పొత్తు ఉంటుందని సంచలన ప్రకటన చేశారు. బిజెపిని కూటమిలోకి తేవడంలోనూ.. తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలో చేర్చడంలోనూ చురుకైన పాత్ర పోషించారు. ఏపీలో మూడు పార్టీల కలయిక సూపర్ హిట్ గా నిలవగా.. జాతీయస్థాయిలో నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి రావడానికి కూడా ఒక విధంగా ఏపీ కారణం. ఇదంతా పవన్ కళ్యాణ్ కృషి ఫలితం.
* ఇష్టమైన మంత్రిత్వ శాఖలు..
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా దక్కింది. అటు పవన్ కళ్యాణ్ సైతం తనకు గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖలు కావాలని కోరారు. అందుకే పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి తో పాటు అటవీ శాఖను ఇచ్చారు చంద్రబాబు. దాదాపు 5 శాఖలు పవన్ కళ్యాణ్ వద్ద ఉన్నాయి. ఆ శాఖల విషయంలో పవన్ కళ్యాణ్ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు గ్రామీణ శాఖలకు కేటాయిస్తూ.. అభివృద్ధికి బాటలు వేశారు పవన్ కళ్యాణ్. పల్లె పండుగ పేరుతో రికార్డు స్థాయిలో గత రెండేళ్లుగా అభివృద్ధి పనులు చేశారు. దీంతో గ్రామాల్లో మౌలిక వసతులు సమకూరాయి. అందుకే జాతీయస్థాయిలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ నెంబర్ వన్ గా నిలిచింది. ఈ క్రెడిట్ మాత్రం వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్.